Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/587

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మొదలైన వస్తువులన్నిటిని ఒంటినిండా చిమ్ముతూ పారేయటం, అది చూసి యజమాని ఏమనుకుంటాడో అని బాధపడుతుండటం, తరువాత తండ్రి దొరను కలుసుకున్నపుడు అతడు పిల్లవాడిని ఆటల్లో అడ్డుకోకుండా స్వేచ్ఛగా వ్యవహరించే అవకాశమిచ్చి పెంచుతున్నందుకు సంతోషించినట్లు అభినందించటం కథావస్తు విశేషాలు.

మార్కండేయ పురాణంలోనూ, మనుచరిత్ర ప్రబంధంలోను ప్రసిద్ధమైన వరూథిని అన్న పాత్రను రూఢిగా నడిపినా, వరూథినీప్రణయాతిశయం కథా ప్రాధాన్యం వహించటం వల్ల శ్రీ దీక్షితులు 'వరూధిని' ని ఏకాదశి కథాసంపుటంలో చేర్చారు. కవిరాయడు తన గీతాది రచనలను మహారాజుకు వినిపించాలని, అంకితమివ్వాలని అభిలషించి యత్నించటం, అతడి ప్రయత్నాలను అంగీకరించక పోవటం వల్ల ప్రజలు మహారాజును కఠినహృదయుడని భావించటం, మహారాజుకు అనుగ్రహం కలగనందువల్ల కవిరాయడు మహారాజు పేరుతో ఒక మూర్తిని ప్రతిష్ఠింపచేసి, తన రచనలన్నీ వినిపించి అంకితమిచ్చి, మహారాజు నెడల తన విశ్వాసాన్ని వెల్లడించటం 'కవిరాయడు'. కథకు వస్తువు.

సాహితికి సాంఘిక కథలను వ్రాయాలని రచయిత ఆలోచనామగ్నుడవుతున్న సమయంలో, పిల్లవాడు వచ్చి కథారచనను భగ్నం చేసి అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పించుకోవడానికి రచయితను విసిగించడం, అందువల్ల జరిగిన ఆలస్యం మూలాన అనుకున్న సమయానికి కథ 'సాహితి'కి కథ రాయలేదని సంపాదకుడు కోపగించుకోవడం, తరువాత కథ వ్రాయడం, ఈ వరసను ఉన్నది అని ముగించటం 'సాహితికి కథ' కథావస్తువు. వస్తువులిస్తూ కొడుక్కు తీవ్రంగా విద్యాశిక్షణ ఆధునిక బోధనపద్ధతి ననుసరించి ఇస్తున్న ఉపాధ్యాయుడైన తండ్రి దగ్గరికి కాలహరణం చేస్తున్నాడన్న దృష్టితో వచ్చిన భార్య, "మీ అమ్మగారు భోజనానికి ఉండలేరు. మీకు ఉద్యోగవేళ అయింది. భోజనానికి కూర్చోడానికి స్నానం చేయ' మని త్వరపెట్టటం, ఆయన తల్లి కొడుకు కాలమంతా పిల్లవాడితో ఆడుకోవటంలో గడిపేస్తున్నాడు కాని చదువు చెప్పటం లేదని భావించి, "వాడికి రెండు ముక్కలు చెప్పకూడదా?” అని అనటం 'పాఠము' అన్న కథకు కథావస్తువు నాన్న చూడకుండా ఉంటే మేకపిల్లతో ఆడుకోవటం, పిల్లి, కుక్క మొదలైన వాటికి ఉత్తరాలు రాయటం, గావం కట్టుకుని కాలవకు వెళ్ళటం మొదలైనవి ఎన్నో చేస్తానని పిల్లవాడు తన ఊహలను వెల్లడించటం 'ఎన్నో చేస్తాను' అన్నదాని కథావస్తువు.


సాహిత్య విమర్శ

587