Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/586

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కథలలోని ఇతివృత్తాలు - వైవిధ్యం

శ్యామల, ముద్దు, మా అబ్బాయి, వరూధిని, కవి రాయడు మహారాజు, సాహితికి కథ, పాఠము, ఎన్నో చేస్తాను, మన్మథ సందర్శనము, గాలిపాట, చెంచు దంపతులు అన్నవి పదకొండు కథలు. విద్యారణ్య స్వామివారు పదిహేను ప్రకరణాలు గల వేదాంత గ్రంథానికి ప్రకరణ సంఖ్యనుబట్టి 'పంచదశి' అని పేరు పెట్టినట్లు కథాసంఖ్యనుబట్టి 'ఏకాదశి' అని పేరుపెట్టి దీక్షితులుగారి కథాసంపుటిని ముద్రించారు.

'శ్యామల' అన్న కథకు జీవితంలోని ఒక అంశాన్ని మాత్రమే వ్రాసి స్వకీయచరిత్ర అని పేరు పెట్టిన శ్రీధరరావు రచనావిషయం ముఖ్య వస్తువు. శ్రీధరరావు చదువుకోసం చెన్నపట్నం వెళ్ళినపుడు శ్యామల అనే యువతితో పరిచయం కావటం, అతడు ఆమెను వివాహం చేసుకోవాలని అనుకోవటం, ఆమె కూడా అతడితో వివాహాన్ని అభిలషించి అనుగుణంగా వర్తిస్తూ ఉండటం, యోగ్యురాలైన ఆమెకు వివాహానికి పూర్వమే జబ్బు చేయటం, ఆసుపత్రిలోనే ప్రాణాలు విడవటం, శ్రీధరరావు ప్రాణాఘాతంలో పడ్డట్లు అనుభూతిని పొందటం, శ్యామల మహారాష్ట్ర యువతి కావటం వల్ల శ్రీధరుడామెను వివాహం చేసుకోటానికి సంఘం అడ్డు వస్తుందని ఆమె అసలు పేరు చెప్పకపోవటం కథావస్తువులోని ముఖ్యాంశాలు.

'ముద్దు' అన్న కథకు అడిగింది ఇచ్చేటట్లయితే కథ చెపుతానని భార్య చేత ఒప్పించి, ఒక వ్యక్తి ఏడుగురు రాణులతో ఉన్న రాజు కథ చెప్పి, భార్యను ముద్దు అడిగి పుచ్చుకొని ఆ ఆనందాన్ని అనుభవించటం కథావస్తువు. రాజుకు చిన్న భార్య అంటే మిక్కిలి ఇష్టం కావటం వల్ల మిగిలిన ఆరుగురు సఖ్యం చేసి, చిన్నరాణికి ఆపదలు కలిగించి కష్టపెట్టడం, చిన్నరాణినే నేను ఎక్కువ ప్రేమిస్తానని రాజు అనటం విని పెద్దరాణి, దాసి సాయంతో ఆ ప్రేమ భగ్నం చేయటానికి పూనుకోవటం ఈ కథా వస్తు ప్రధానాంశాలు.

'మా అబ్బాయి' కథకు తండ్రి నవల చదువుకుంటుంటే మూడేళ్ళ పిల్లవాడు వెట్టి చేష్టలతో మాటిమాటికీ అల్లరి పెడుతూ పుస్తకం లాగుతుండటం, తండ్రి వాడిని తల్లి దగ్గరికి పంపించటం, తల్లి వాణ్ణి తిట్టడం, వాణ్ణి గురించి తల్లిదండ్రులిద్దరూ పోట్లాడుకుంటుంటే, వాడు తల్లిదండ్రులిద్దరూ తగాదా పడవద్దని బతిమలాడి తల్లిదండ్రుల చేతులు కలపటం, ఆ సమయంలో తండ్రి ఉద్యోగయజమాని అయిన కొత్తగా వచ్చిన పోలీసు దొర ఒంటరిగా ఇంటికి రావటం, పిల్లవాడు సిరాబుడ్డి


586

వావిలాల సోమయాజులు సాహిత్యం-4