Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/584

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సంభాషణ వస్తువుగా నడిపిన 'మానవుడు', వెల్లమొక్కల విత్తనాలు చేసే నాశనం, వాటిని నివారించుకోటం కోసం చెట్టుతో కొందరు సంభాషించి వస్తువుగా నడిపిన కైలాస శిఖరం' అన్న మూడు రూపణ నాటికలు (Allegorical plays) సహాయ నిరాకరణతో దేశాన్ని ఉఱూతలూగించే కాలానికి సంబంధించిన రాజకీయాభిప్రాయాలను ఆవిష్కరించాయి. గ్రాంథిక భాషావిషయం వస్తువుగా నడిపిన ప్రహసన నాటిక 'తెలుగు శాస్త్రులు.' ఈ నాలుగూ రూపకకర్త అపరిణతావస్థను కొంతగా ప్రకటించే మొదటి భాగానికి సంబంధించినవి.

మృదుమధుర వ్యవహారిక భాషావిన్యాసంలో సిద్ధహస్తులైన దీక్షితులు, ఆయన గ్రాంథిక భాషారచనా పాటవానికి, ప్రతీకలైన రచన వివిధ వర్ణాలతో నడచినట్లు నడిపిన వరూథిని. ప్రతిబింబితమైన ప్రాథమికావస్థ గాఢ పరిణతావస్థతో ప్రతిధ్వనించినట్లు, ఒక ఉత్కృష్ట వచన ఖండకావ్యంగా నడిపిన 'చక్రవాక మిథునం'. 'నశించిన ప్రాచీన రాజ్య వైభవం' సామాన్య దృష్టులకీ అగోచరమైన స్థిరతను జ్ఞాని వలె తిలకిస్తూ రచయిత ఆనందిస్తున్నట్లు మేధాగాంభీర్యంతో నడిపించిన 'దసరా అబ్బి', జమదగ్ని మహర్షి ఒక మహావీరుడి జన్మకోసం రేణుకాదేవిలో ఉన్న అంతశ్శక్తులను రేకెత్తిస్తూ నడిపిన 'రేణుక', 'పూరువు వద్ద యౌవనాన్ని స్వీకరించి, శర్మిష్ఠతో యయాతి వయోభారాన్ని అనుభవించటాన్ని అభిలషించటం వస్తువుగాను, రూపకళ ఆత్మౌన్నత్యాన్ని స్పృశించినట్లు నడిపిన 'శర్మిష్ఠ' అన్న ఐదు నాటికలు రెండవ భాగానికి సంబంధించినవి. దీక్షితులు రూపకాలలో ఇవి సర్వోత్కృష్టమైనవి.

ఆధ్యాత్మికదృష్టితో భక్తిభావమే కాక, అస్పృశ్యత కూడా ఓ సమస్యగా ధ్వనింపచేస్తూ నడిపిన 'తిరుప్పాణాళ్వార్', మనోహరాతి మనోహరమైన అహల్య శిలావర్ణనతో భక్తి భావనాతిశయంతో నడిపిన 'అహల్య', శ్రీకృష్ణుడిలో శిశు స్వభావ చిత్రణను, ఔన్నత్య శిఖరాన్ని స్పృశించేటట్లు, యశోదలో మాతృత్వాన్ని అంతకంటే అతి మనోహరంగా తాను పొందినట్లు నడిపిన 'శ్రీకృష్ణుడు' అన్న మూడు నాటికలు మూడవ భాగానికి సంబంధించినవి.

బాలసాహిత్యం: శ్రీ చింతా దీక్షితులుగారు ఒక్కరే జానపదగాథల విజ్ఞానశాస్త్ర విషయాలను సమన్వయదృష్టితో సంతరించి పాఠ్యపుస్తకాలను, వీటిలో తాము సంపాదించిన పద్య గేయ బాల వాఙ్మయాన్ని సముచితంగా సమీకరించారు.

కథారచన: “అచ్చమైన తెలుగు కథ శ్రీ దీక్షితులుగారి ఊహలో తొలిసారిగా జన్మించింది” అని కాలధర్మవార్త ప్రకటిస్తూ, భారతి అంగీకరించింది. (భారతి సెప్టెంబర్


584

వావిలాల సోమయాజులు సాహిత్యం-4