Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/580

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంధ్ర కథకుల్లో చింతా దీక్షితులు, గుడిపాటి వెంకటచలం ఇద్దరు ఉత్తములు. “అయితే జీవితంలో ఆదర్శాల విషయంలో కేవలం ఉత్తర దక్షిణ ధ్రువాలు. చలం గారొక పెద్ద జలపాతం వంటి వ్యక్తి. మరి దీక్షితులుగారో నిర్మల క్షీరసరోవరం. ఒకరొకరి రచనలయెడ గౌరవం వల్ల అయితేనేమి, నిశితమైన నిజాయితీ వల్ల అయితేనేమి వీరిద్దరికి చిక్కని చెలిమి ఏర్పడ్డది. ఇరువురు అన్యోన్య లేఖల్లో సారస్వతాల గురించి, సమస్యల గురించి చర్చలు సాగించారు. 1927 మొదలు 1954 వరకు చలంగారికి వ్రాసిన లేఖలను విజయవాడ దేశి కవితామండలివారు 1957లో ముద్రించారు. ఆ పుస్తకానికి పీఠికగా ఒక మాట వ్రాస్తూ అందులో దీక్షితులు ఇలా అన్నారు - "ఈ ఉత్తరాలు నేను దాచటానికి కారణం నాకు కీర్తి తెచ్చుకుందామని కాదు; వెంకట చలంగారికి కీర్తి తెద్దామని కాదు. నేను ప్రేమించిన స్నేహితులలో వెంకట చలంగారు ముఖ్యులు. నా ప్రేమకు బదులు ప్రేమ ఆయననుంచి నాకు కావలసినంత దొరికింది. ఆయన ఉత్తరాల్లో నిష్కాపట్యమూ, ప్రేమా, హాస్యమూ, హృదయవేదన నన్నాకర్షించాయి. పై కారణాలవల్లనే వారి ఉత్తరాలు దాచాను. అవి ఎప్పటికయినా ముద్రిస్తారని కూడా మేముభయలము అనుకోలేదు.”

దీక్షితులు పరిశోధక నవలలు వ్రాసే రోజుల్లోనే మొదట ప్రౌఢ ప్రాబంధిక శైలిని త్యజించి, సామాన్యశైలిలో పాఠకసుబోధకంగా ప్రకృతివర్ణనాత్మకము, నీతి బోధకము అయిన ఆత్మాశ్రయ పద్యరచన చేశారు.

“మంజుల మధుర సంపద నంది యుండు

మతిని గులాబి వచించు నరవిందమనును

నిర్మల భావ మన్నిట జెందుమనుచు

కష్టాలనన్నిట గడుపుకొమ్మనుచు

చిక్కని చేమంతి చెప్పును గరిమ

ఉన్నంత ప్రజకిచ్చి ఊరుకొమ్మనుచు

దేవకాంచన ముపదేశ మొనరించు నెండ

వానల గణియింపకసంత

సము చెందుమని పల్కు స్వచ్ఛమౌ తుమ్మి”

- పుష్పోదేశము సాహితి 116 పుట 1926


580

వావిలాల సోమయాజులు సాహిత్యం-4