Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/578

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మహాసభకు, శ్రీ రాయప్రోలు సుబ్బారావు అధ్యక్షుడుగా రాజమహేంద్రవరంలో 1933 డిసెంబర్ నెలలో జరిగిన సభకు, 1935లో గిడుగు వారు తమ పర్లాకిమిడిని ప్రభుత్వం ఒరిస్సా రాష్ట్రంలో కలిపిందని బాధతో ఆ ప్రాంతాన్ని పరిత్యజించి రాజమహేంద్రవరం వచ్చినపుడు చేసిన సన్మాన మహాసభకు, చింతా దీక్షితులను అపూర్వమైన అభిమాన గౌరవాలతో అగ్రాసనాధిపతిగా ఎన్నుకోవటం, ఆయన ఆయా సభలను మహోదాత్తంగా నిర్వహించటం జరిగాయి. అభినవాంధ్ర కవిపండిత పరిషత్తు సభలో ఒక ప్రముఖుడుగా పాల్గొన్నారు.

ఉత్తమోపాధ్యాయుడుగాను, ఉన్నత విద్యాపర్యవేక్షకుడుగాను, గౌరవనీయ సాహిత్యకుడుగాను, గణనీయమైన ప్రసిద్ధిగన్న వీరికి 1946లో తెనాలి నగరంలో మన సన్మానం జరిగింది. సన్మాన సంఘాలవారు ఆంధ్రదేశంలో అనేక ప్రాంతాలనుంచి వచ్చి ఆహ్లాదకరంగా వీరిని సన్మానించి 'బ్రహ్మరథం' పట్టారు. పూర్వమే భార్య స్వర్గస్థురాలు కావటం చేత, ఉద్యోగం విరమించిన కొంతకాలం తరువాత 1959 వరకు, పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురంలో సన్యాసివలె జీవించారు. అనారోగ్యం వల్ల బాధపడుతూ అప్పుడప్పుడూ ప్రజావాఙ్మయ సంపాదన ప్రకటనలు చేస్తూ, చివరకు అస్తమయం, ఏడాది ఉండగా కడలూరులో ఉంటున్న కుమారుడి ఇంటికి చేరి, 25-8-1960 నాడు పరమపదించారు.

ఆధ్యాత్మిక దృష్టి పెంపొందిన తరువాత చింతా దీక్షితులు మొదట హరనాథ బాబా (1865-1937) భక్తుడయినాడు. 1932లో ఆ హరనాథ బాబా మీద వచ్చిన ఆంగ్ల గ్రంథాన్ని 'ఉపదేశామృతం' (మొదటి భాగం) అను పేరుతో ఆంధ్రీకరించి ముద్రించారు. తరువాత అరుణాచలంలో పుణ్యజీవితాన్ని వహించి వ్యవహరిస్తూ రమణ మహర్షి పంథా యెడ చిత్తం లగ్నమై, చివరి వరకు నిలవటం జరిగింది. స్వచ్ఛ హృదయంతో, జిజ్ఞాసాత్మక చిత్తంతో, భక్తితత్పరతతో తన పరిచయాన్ని ఆకాంక్షించి ఆశ్రయించిన శ్రీ దీక్షితులమీద రమణ మహర్షికి అత్యంతమైన ఆత్మీయత ఏర్పడ్డది. శ్రీ దీక్షితులు మహర్షిని ఉద్దేశించి వ్రాసిన రచనలతో 'నివేదన' అన్న చిన్న పుస్తకాన్ని ప్రకటించారు. రమణ మహర్షి యెడ విశ్వాసం స్థిరమైన తర్వాత, శ్రీ దీక్షితులు ప్రియమిత్రుడు గుడిపాటి చలానికి వారి ఆశ్రయాన్ని కల్పించటం, ఆయన మహర్షి ఆశ్రమంలోనే ఉద్యోగానంతరజీవితం యొక్క చివరి సమయాన్ని గడపటం జరిగాయి. మహర్షి పరమ పదించినపుడు ఆయన అమూల్య వస్తువులన్నిటినీ క్రోడీకరించవలసిన బాధ్యత పడ్డ ఆశ్రమంలోని విఖ్యాత వ్యక్తి. వాటిలో మమకారాలు సర్వం పరిత్యజించిన రమణ మహర్షి స్వదస్తూరితో వ్రాసుకొని భద్రపరచుకొన్న చింతా దీక్షితుల ఈ 'నివేదన'


587

వావిలాల సోమయాజులు సాహిత్యం-4