భీమశంకరంగారితో కలిసి 'చింతా శంకర దీక్షితులు' అన్న పేరుతో చిత్రరేఖ (1912), అలహసింగరి అన్న అపరాధపరిశోధక నవలాదులనూ, కొన్ని కథలను ప్రచురించారు. 'శంకర దీక్షిత' నామంతోను కొంత పద్యకవిత్వరచన సాగించారు. 1913లో రాజగిరి రాజు' అన్న నవలను దీక్షితులు ప్రచురించారు.
మారుతి అన్న మారు పేరుతోను కొంత కథారచన చేశారు. ఆధ్యాత్మికచింతన స్థిరం కాకపూర్వం, డార్విన్ శాస్త్రజ్ఞుని ప్రకృతి పరిణామ సిద్ధాంతం యెడ ఆసక్తి కలిగింది. శాస్త్ర విజ్ఞానాన్ని ప్రచారం చేయటానికి, దేశభాషలో గ్రంథ రచన జరగాలన్న సిద్ధాంతం ప్రచార కృషి ప్రారంభం కావటానికి ఎంతో పూర్వమే, 1919లో పరిణామవాదము - తన్నిదర్శనాలు అన్న గ్రంథాన్ని లిఖించి ప్రచురించారు. 'ప్రపంచమీ స్థితి కెట్లు వచ్చినదో, మానవ జాతి ప్రస్తుతావస్థ కెట్లు పరిణమించినదో విపులముగా సిద్దాంతము చేసిన ఈ పుస్తకాన్ని ఆ నాటి మోడరన్ రివ్యూ పత్రిక సమీక్ష చేస్తూ, "We are glad to review this book. The author had very well succeded in producing a good book on the subject (evolution)" అన్నది. ఈ పుస్తకం మదరాసు సర్వకళాశాల పారితోషికాన్ని, రామారాయనింగారి బహుమానాన్ని పొందటం జరిగింది.
అంతర్ముఖులై దేనికోసమో అన్వేషిస్తున్నట్లుండే ఆయనలో పూర్వమే ఆధ్యాత్మిక దృష్టి బయలుదేరింది. సన్యాసులుగాని, యోగులుగాని, కన్పిస్తే వారి వెంట పడేవాడు. ఒక యోగి రాళ్ళు రువ్వినా లక్ష్యపెట్టకుండా వెంటపడడం జరిగింది. కొంతకాలం సాగిన తరువాత ఈయనకు రమణమహర్షి దర్శనభాగ్యం లభించింది. అటు తరువాత క్రమక్రమంగా సారస్వతాన్ని స్మరించడం కూడా మానడం జరిగింది.
గురజాడవారి గేయ పద్య రచనామార్గాల యెడ సాహిత్యప్రియత్వం ఆరంభమయిన దినాలనుంచి చింతా దీక్షితులు ఆసక్తి వహిస్తూ, వారిని గొప్పగా గౌరవిస్తుండేవారు. ఆ దినాలనుంచే గిడుగువారి వ్యావహారిక భాషాసిద్ధాంతాన్ని అంగీకరించి పండితమ్మన్యుల ఈసడింపులు, అవహేళనలు లక్ష్యపెట్టక నిర్విరామంగా వ్యావహారిక భాషలో రచనావ్యాసంగం సాగిస్తూ, వారినే ఘనంగా గౌరవిస్తుండేవారు. వీరు సైతం ఆ ఉభయుల మార్గాలను అనుసరించి ఆయా విధానాలకు ఉప నాయకులయినారు. అందువల్లనే పై ఉభయుల మార్గాలను, విధానాలను అనుసరించే 'ఆధునిక సాహిత్యానికి వర్ధమాన ప్రముఖకేంద్రాలలో ఒకటయిన రాజమహేంద్ర వరంలో తమ అనుచరులు 28-10-1932లో జరిపిన గురజాడ వారి వర్గంతి
సాహిత్య విమర్శ
577