Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/576

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చింతా దీక్షితులు (1891-1960)

చింతా దీక్షితులు నవ్య సాహిత్య ప్రారంభ దశలో కవిగాను, గేయ రచయితగాను, ప్రజా సాహిత్య సంపాదక పరిశోధకుడుగాను, ప్రచారకుడుగాను, స్త్రీ సాహిత్య సంపాదక పర్యవేక్షణ ప్రబోధకుడుగాను, భాషా సాహిత్య నిర్మాతగాను, నాటికాకర్తగాను, ప్రధాన.కథారచయితగాను ఆధునిక సాహిత్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం వహించిన సాహితీ సమితి ప్రారంభసభ్యుల్లో ఒక ప్రముఖవ్యక్తిగాను, నిష్ణాతుడైన వ్యావహారిక భాషాప్రచార బోధకుడుగాను ప్రఖ్యాతిగన్న సాహితీతత్పరుడు, బహుముఖీన సాహిత్య సంపన్నుడు.

తూర్పుగోదావరి జిల్లాలో కణ్వనదీ తీరాన ఉన్న దంగేరు, చింతా దీక్షితుల వారి స్వస్థలం. వీరు 1891లో అక్కడనే జన్మించారు. వీరి తండ్రిగారు, తాతగారు విఖ్యాతిగన్న వైదిక సంప్రదాయ నిష్ణాతులు, నిష్టాగరిష్ఠులు. వీరు చిన్నతనం నుంచి మంచి అభిలాషతో ఆంగ్లవిద్యను అభ్యసించటం జరిగింది. మంచి తెలివితేటలు గల వీరు,.రాజకీయ, సాంఘిక, సారస్వత జిజ్ఞాసతో విద్యనభ్యసించి రాజమహేంద్రవరం.కళాశాలలో 1913లో బి.ఏ. పట్టభద్రులైనారు. ఉపాధ్యాయ విద్యను అభిలషించి.1915లో సైదాపేటలో ఎల్.టి. అయినారు. విద్యారంగ సంస్కరణ దృష్టితో ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించి కొంతకాలం అనేక ప్రభుత్వోన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుడుగా పనిచేశారు. తరువాత బహుకాలం పాఠశాలల పర్యవేక్షకులుగా (SeniorDy Inspector of Schools) ఉద్యోగం చేశారు. 1946లో విరమించారు. ఉద్యోగ నిర్వహణ కారణంగా దీక్షితులు కనిగిరి, మార్కాపురం, కర్నూలు మొదలైన రాయలసీమ నగరాల్లో; నరసరావుపేట, గుంటూరు, రాజమండ్రి, జిల్లాలలో తిరగడం మూలాన, ఆ ప్రాంతాల ప్రజల జీవితాలను, ఆ ప్రాంతాలలోని గ్రామాదులను పరిశీలించటం వల్ల, వీరికి ఆంధ్రదేశంలోని అనేక ప్రాంతాలకు సంబంధించిన జనజీవితం తోటి, జానపద సాహిత్యచరిత్రల తోటి, ప్రకృతివిశేషాల తోటి అమూల్యపరిచయం, కలిగి పద్య రచనాదులకు ఎంతగానో ఉపకరించింది.

1917లో సాహితీసమితి ప్రారంభం కాక పూర్వమే వీరు 'ఆప్తబంధువులు' నవలారచయితలు. 1940లో ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ విరమించిన చింతా


567

వావిలాల సోమయాజులు సాహిత్యం-4