Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/575

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొంచెము తక్కువ సమర్థుడు. కాని ఊహలు సూర్యమండలానికి పోతవి. జటాయువు బలవంతాన సంపాతి కూడా పతంగలోక యాత్రకు ఒప్పుకుంటాడు. జటాయువు కాలిపోబోతూ ఉంటే సంపాతి రక్షించి తన రెక్కలు కాల్చుకుంటాడు. పడిపోతూ ఇద్దరూ తన అపాయము సంగతి ఆలోచించుకోరు. మన ఇద్దరికీ స్వభావాలలో వారితో పోలిక ఉన్నది."

కొత్త వాక్యాలు చెప్పడంలోనూ, ఊహించడంలోనూ నోరికి ఉత్సాహం ఎక్కువ. 'పరకాయ ప్రవేశము', 'గాలివాన', 'మహిషాసుర మర్దనము', 'పంచబాణము' ఇత్యాది కవితావస్తువులు ఇదివరకే ఆలోచించి ఉంచినవి, ఇంకా రూపం తాల్చలేదు. వాటిని చదివే భాగ్యం త్వరలో లభిస్తుందని విశ్వసిస్తున్నాను.

- ప్రతిభ సం. 6 సంచిక 1


సాహిత్య విమర్శ

575