శా
'నా యజ్ఞానము గర్వమున్ కలుషమున్ నానాటికిన్ వృద్ధియై
మాయన్ లేక మదిన్ శిరోగ్రమున నిమ్మాడ్కిన్ ప్రసాదించె నే
మా యనిపించెడి దీర్ఘ కేశముల నీకర్పించితిన్ భక్తితో
నా యాకారవికారచింతనము సన్న్యస్తంబుగా నాత్మలోన్. '
అని పూర్వోదంతాన్ని కావ్యం చేశాడు. 'పరమేశ్వరి', 'కామేశ్వరి' అని జగదేకమాతను సంబోధించి ఆయన ధ్యానిస్తాడు. కామరహితునిగా చేసి పరోపకారబుద్ధి ప్రసాదింపవలసిందని ఆమె ముందు ప్రాధేయపడతాడు.
తే.గీ.
'పగలు రేయును నపరాధబహుశతమ్ము
చేయు నను పుత్రబుద్ధి రక్షింపు మంచు
బాష్పగద్గదితాక్షర పంక్తితోడ
విశ్వజనని ప్రసన్న' - కావించుకొంటాడు.
ఈ లోకంలోకి ఒక యాత్రికుడుగా వచ్చిన తన్ను రేవు దాటేయవలసిందని, కష్టాలకు క్రాగిపొయ్యానని - 'ఓ నావ నడిపే పల్లెకారీ ఆ రేవు దాటేయరా!' - అని కరుణంగా యాచిస్తాడు ఆ జగదేకపితను. అనేకమంది కవులకు దోహదసేవ చేసినట్లే శ్రీ శివశంకరశాస్త్రి ఈయనకూ చిన్నతనంలో చేశాడు. కానీ కవితావిషయంలో ఆయన ప్రభావం నోరిమీద ఏ మాత్రమూ లేదు. కవితారచన విషయంలో ఇద్దరూ రెండు ధ్రువాలు. ఆ విషయం నోరి, శ్రీ శివశంకర శాస్త్రికి వ్రాసిన ఒక ఉత్తరంలో ఇలా వ్యక్తీకరించాడు -
“స్త్రీ విరోధి" చదివాను. బాగున్నది. కానీ అది భూలోకం దాటిపోలేదు. అది లోపమని నా ఉద్దేశము కాదు. కాని నీ రచనలన్నింటిలో ఆ గుణమున్నట్లున్నది. దాన్ని ఏమనవలెనో తెలియదు. Realism అనవచ్చునేమో! అది ప్రధానముగా ఉంటుంది. నాకు మాత్రము రచనలు లోకాతీతముగా ఉండకపోతే తృప్తి ఉండదు. నాకా శక్తి లేకపోవచ్చును.
“నేను కొత్తగా వ్రాసిన నాటిక terminology లో ఆలోచిస్తే మన భేదము జటాయువు, సంపాతిది ఉన్నట్లుగా ఉంటుంది, సంపాతి పెద్దవాడు, ఎక్కువ సమర్థుడు. అయితే భూలోకము విడిచి పోవడానికి యత్నించాడు. జటాయువు చిన్నవాడు,
574
వావిలాల సోమయాజులు సాహిత్యం-4