"అలల వేగము తెడ్ల త్రోయుము చండపవను వశీకరింపుము పడవ నడపు తృణీకరించుచు ప్రకృతి ఘనశక్తిన్" “అబ్ధి యెంత గంభీరమైనను అందు తేలగ తెప్పయున్నది పడవ యొరగదు, పడవ మునగదు పడవ పగులనిది!" అని ప్రబోధించటము కూడా కద్దు. కానీ ఈ అహంభావము సర్వకాల సర్వావస్థలలో నిలిచేది కాదు. 'కాలధిక్కృతి'లో శా. 'ఏమాత్రంబు భవత్ప్రతాపమహిమం బిచ్ఛాగతిం గాంచగా లేమింగాదు మదీయజృంభణము; స్వల్పీయంబు నాశక్తియౌ నామాటల్ శమియించుగాక నిల సంచారంబులో నింతలో నేమాయెన్ హృదయంబు నిండిన పవిత్రేచ్ఛల్ సుహృద్ భావముల్ ?' అని పావిత్ర్యము, సుహృద్భావాలతో నిండిన జీవితము ఏమైనా ప్రమాద రహితమైనదని అన్నాడు, 572 'జన్మముతోడనె జాతం బైనది జనులకు మృత్యువు జగతిన్ ఒక్క ముహూర్తం బెక్కువ బ్రతుకగ బిక్కమొగం బిడనేలా? ఒక్క ముహూర్తం బెక్కువ మనుటకు టక్కరిమాట లవేలా? చిరకాలమ్మును జీవింపగ ధర జీవసిద్ధులము కాము. కీర్తి కాయముల క్రీడింతుము బహు గ్రీష్మ కాలముల మేము’ వావిలాల సోమయాజులు సాహిత్యం-4
పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/572
స్వరూపం