Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/571

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

- అని ఆదరిస్తాడు. 'ఆశాకిరణము, భిన్నమైత్రి, మిత్రప్రతిష్ఠ, మిత్రవియోగము' - మొదలైన కావ్యాలు మైత్రికి సంబంధించినవి, మైత్రి ఏర్పడే మొదటి రోజుల్లోనే మిత్రుని రూపాన్ని హృదయంలో సృష్టించుకొని, మిత్రుడు తప్పేదైనా చేసినా అతని నిజ స్వరూపాన్ని - హృదయంలో సృష్టించుకున్న దాన్ని చూచి వెనక్కు తగ్గుతాడు, మిత్రునికి, తనకూ భేదభావం కలిగినప్పుడు 'సర్వజ్ఞ స్వామి'కి నివేదిస్తాడు. బాల్యావస్థలో కవి ప్రతి వస్తువును కవితాచక్షువులతో చూచి ఆనందించేవాడు. ఆయనలో తాత్త్విక దృష్టి అభివృద్ధి అవుతున్నకొద్దీ ప్రతి విషయమూ ఏదో గొప్ప వ్యక్తిత్వంతో కనపడేది. చిన్నప్పుడు వ్రాసిన 'బూచి' అనే కావ్యం ఊహా ప్రధానమైనది. ఆరు వత్సరాల కుర్రవాడు, తే.గీ. 'ఎండుటాకులు త్రొక్కుచు నెగిరి యెగిరి చిన్నవాడందు తన చేతి చిన్ని వ్రేళ్ళ జీటిమాటికి కురు లెగజిమ్ము కొనుచు కుప్పలుగ గొన్ని వర్ణముల్ కూర్చుచుండె. ' తరువాత ఆ పసిపిల్లవాడు చిన్నపిట్ట యీకను చూచి దానిని నోటితో ఊది ఎగరవేసి, దాని వెంటనే కొంత దూరము పోయి అది విచ్చీవిచ్చని మొగ్గలో చిక్కుకుంటే రెంటినీ విడదీయలేక కలిపి గాలిలో వదిలిపెట్టాడు. ఇంతలో తీవ్రపవనుడు వచ్చి అతని కవి కనబడకుండా చేస్తాడు, పిల్లవాని మనస్సు ఇంతలో వేర్వేరు క్రీడలమీదికి పోతుంది. ఈ చిన్న కావ్యం మానవజీవితానికి సంబంధించిన ఒక సత్యాన్ని ప్రకటించే శక్తిని (Revealing effect) తనలో దాచుకున్నట్లు కనిపిస్తుంది. మహాకవి షేక్స్పియరు అన్న - - "Life is but a walking shadow, a poor player, That struts and frets his hour upon the stage, And then is heard no more; it is a tale, Told by an idiot, full of sound and jury - Signifying nothing" అనే సత్యం ఈ కావ్యంలో గర్భీకృతమైనట్లు ప్రస్ఫుటమౌతుంది. 'నిర్యాణ’మనే కావ్యంలో జీవితములోని ఒక వైచిత్రాన్ని కవి సూచించాడు. ఒక్కొక్కప్పుడు ప్రచండ శక్తిమంతుడైన మానవుడు ప్రకృతికి లొంగిపోవలసిందేనా? అనే భావపరంపరలో మునిగిపోయి అహంభావం రేకెత్తి - సాహిత్య విమర్శ 571