అని యతఁడు పల్కిన పల్కు నూహింప నెన్ని విశేషములు ద్యోతకము లగుచున్నవి!
'ఉన్మాదులు సంఘటింపగ సమర్థులె యెందును రాయబారముల్' అని తుద కతఁడెంత
విలపించిన బ్రయోజన మేమున్నది?
దౌత్యమునకే కాదు, మైత్రికిని మధుకరకుమారునిది పెట్టిన పేరు. మిత్రులను దన పారిపార్శ్వకులలోఁ జేర్చుకొని తాను రిక్కల మధ్య వెలుఁగు రేవెలుఁగు వలె సంచరించుట యతని యభిమతము కాదు. అతని హితులు గ్రహములు గాని యుషగ్రహములు కారు. 'భయయోగమున నైనఁ' దనతో మైత్రియొనర్చు వారిఁ దనంత వారిఁ జేయుట యతనికిఁ బరిపాటి. దీనిఁ గమనించియే కదా విజ్ఞులు 'భ్రమరకీటన్యాయ' మును లోక విఖ్యాత మొనర్చినది!.
భ్రమర ముదాత్తప్రకృతి; ఉన్నతసృష్టి. కాకున్న శంకరపూజ్యపాదులు 96[1]కవుల సందర్భ స్తబక మకరందైక రసిక కర్ణయుగళమును విడువక నవరసాస్వాద తరళ కటాక్ష వ్యాక్షేప భ్రమరకలభములఁ జూచి భవదళికనయన మసూయాసంసర్గముచే నించుక యెఱ్ఱవారిన' దని యా సౌందర్యలహరిని వర్ణించునా! "ఓ భగవతీ! దీనుల కనిశ మాశాసుసదృశశ్రీదాత్రియును, నమందవికిరన్మందార స్తబకసుభగమును నగు నీ చరణమందుఁ గరచరణములచే నేను షట్పదము నగుదును గాక!!' యని తానంబికాపాద మకరందలోలుప భ్రమరము గానాకాంక్షించునా!
మేఘమండలమున యాన మొనర్చు 'భ్రమరకుల రాజ్ఞి'ని గనినవేళ నెన్నెన్ని మనోజ్ఞ భావము లుత్పన్నము లగుచున్నవి? 97[2]శాంకరీ! పల్కు మీ ఝంకార మేమిటో, మంత్రమా? గీతమా? మఱి మాయయా? లీలయో, నాట్యమో లేక భ్రామరీ తెల్పు మీ భ్రమర విభ్రమ మేమొ! సాధకుని యాత్మలో జ్ఞానదీపము వోలెఁ గనుపించి మాయమై కనుపింతునే! తెలియలేమే మేము! ప్రణయమో, ప్రభవమో, లాస్యమో, తాండవమొ మముఁ దేల్చవే తల్లి!” ఈ రీతిఁ బొడము నూహ లనంతములు కదా!
సృష్టిస్వరూపుఁ డైన పరమాత్మ పరముగఁ 'బ్రళయావసానమునఁ బ్రహ్మాండ మవియఁగాఁ బ్రభవించు నాత్మభవుఁ డీ రీతిన్. చీఁకటుల సృష్టించి లోకముల శ్రీమించు నాత్మభవుఁ డీరీతిన్' మొదలైన యూహ లెన్నెన్నియో సాధకునకుఁ దోఁచును. భ్రమరశిల్పమున జగత్స్రష్ట యింతటి భావగోపన మెందుల కొనర్చినాఁ డను ప్రశ్న యుదయింప నించుక తర్కింప సమస్త సృష్టియు నరసికుల కైనది కాదని యభివ్యక్త
మగును. 'రసోవై సః', 'నేహ నానాస్తి కించన్'.- ↑ 96. “కవుల సందర్భ - ఓ భగవతీ" - ఆచార్య శంకరుని సౌందర్యలహరిలోని
క్రింది శ్లోకములు మూలములు :
"కవీనాం సందర్భస్తబక మకరందైకరసికః
కటాక్షవ్యాక్షేపభ్రమరకలభౌ కర్ణయుగళం |
అమునంతా దృష్ట్వా తవనవరసాస్వాద తరళే
అసూయా సంసర్గా దలికనయనం కించి దరుణమ్ ||"
"దదానే దీనేభ్యఃశ్రియ మనిశ మాశా సుసదృశీ
మమందం సౌందర్య ప్రకర మకరందం వికిరతి !
తవాన్ని న్మందారస్తబక సుభగే యాతు చరణే
నిమజ్జన్మజీవః కరసుచరణైష్షట్చరణతామ్ ॥ - ↑ 97. "శాంకరీపల్కుమీ, ప్రళయావసానమున" - శ్రీ నోరి నరసింహశాస్త్రి "తేనెతెట్టె" నుండి
____________________________________________________________________________________________________
మణిప్రవాళము
57