తే.గీ. 'అరయక భవన్ముఖాబ్జంబు శిరము వాల్చి ఫాలభాగము నీభుజోపరి శయింప అశ్రుధారల నీకు పూజార్పణమ్ము చేయు నను గాంచుకొనుచును సిగ్గుపడితి.' అని తన చేష్టకు తానే సిగ్గుపడుతుంది. 'విభ్రాంతిలో' నాయిక యౌవనంలో నాయకుని రూపరేఖావిలాసాలను చూచి మోసపోయి, తరువాత పూర్వస్థితి అంతా కలవరమని అనుకొంటుంది. 'ఘాతుక ప్రియ'లోని నాయిక నాయకుని దుష్టత్వాన్ని గ్రహించి తే.గీ. 'నీ చిఱుత నవ్వు భ్రాంతి సంధించి ఎదను లేనిపోని యాశలు చిగురింపజేయు మంచు తొలగును శశియుదయించి తోచు అంతలో నీ ముఖంబు హిమాద్రి యగును. ' తే.గీ. 'తీవ్రతృష్ణాతురుని మృగతృష్ణ వోలె చపలమత్స్యాంగనల నామిషంబురీతి నీ సుషమపేశలాకృతి నీ మృదూక్తి బలిమి కర్షించి నాదు దర్పము హరించు.' తే.గీ. 'శాశ్వత విసర్జనేచ్ఛమై సాగునంత అడుగు కదలక దారువై యట్టె నిలుచు ప్రాణఘాతుక యను కొన్న ఫలితమేమి? ప్రాణనాయిక యనినోట వాక్కు వెడలు.' - అతను వస్తే ఏమీ అనలేక తన హృదయాన్ని అతనికే అర్పించి ఊరుకుంటుంది. 'ఆత్మార్పణము' శ్రీ శివశంకర శాస్త్రి హృదయేశ్వరికి నాయికాపక్షంగా నోరి ఊహించిన జవాబు. కవికి సంయోగం కన్నా వియోగమంటే ఎక్కువ ఇష్టము. 'ఎడబాటు' అనే కావ్యంలో - 'ప్రేమ! నీతోడ నైక్యమ్మునొందుకంటే నధికమధురిమ గల దెడబాటునందు' అని పాడాడు. 'ప్రేమ గీతములు', 'ప్రియాతిశయోక్తి' ఈ శ్రేణికి చెందిన గీతాలు. ఇలా కవి నాయికలోని మానసిక వైవిధ్యాన్ని రకరకాలుగా ఊహించి చిత్రించాడు. సాహిత్య విమర్శ 569
పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/569
స్వరూపం