Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/566

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఉ. 'శైశవవేళ బాల్యమున శాంతవిశృంఖల సాధువృత్తి
పేశల రమ్యగర్భ పద వీ స్థితి నెప్పుడు విశ్రమింతు క్షీ
రాశనుడైన యర్శకుడనారత మంబయురస్థలంబునన్
లేశము చింతలేక పవళించి సుఖించు మనోజ్ఞ వైఖరిన్.'


ఉ. 'పల్లవ పుష్పకోరకిత భాస్వరరూపము దాల్చి నీవు శో
భిల్లు వసంత దివ్యతరవేళ లతాగ్రము లెక్కి యోగి యు
త్ఫుల్ల మనంబుతో పికము ముద్దులపాటల నాలకింతు, నీ
వల్లన శ్రాంత వౌ శిశిర మందున నేనును విశ్రమించెదన్.'


ఉ. 'ఈ విధినెల్ల కాలము గతించిన మేలయి యుందుగాని యిం కోవిధమయ్యె దైవగతి, యొయ్యన శైశవ బాల్యముల్ చనన్, యౌవన మంకురించె, హృదయంబున వెంటనె మొల్కలెత్తె హ ర్షావహ నవ్యభవ్య వివిధాశయముల్ మధురప్రయత్నముల్.'

ఉ.'తల్లి, క్రమంబుగా స్మృతి పథంబున దూరము కాదొడంగెయు
పుల్లలితామలాకృతి, ప్రసన్నములై రుచిరంబులై సుధా
వేల్లితముల్ ప్రతిక్షణ వివృద్ధములై సనసౌఖ్యరాజి భా
సిల్లె త్వదాఖ్యయే నిరవశేషము నామది విస్మృతింపగన్.'


ఉ.'ఆ కలకంఠ కంఠ నిసృతార్ద్ర కుహూధ్వని నన్నినాళ్ళకున్
నీ కరుణాస్వరంబు విననేర్చితి, నావిధ మొన్నినాళ్ళుగా
నాకయి కంఠ మెత్తి కరుణంబున బిల్చితివో ఆమానమౌ
నీకృప నీమహత్త్వము గణింపదరంబె కృతజ్ఞబుద్ధికిన్. '


అని ప్రకృతికి విన్నవిస్తాడు. కవిలోని తాత్విక దృష్టి అభివృద్ధి అవుతున్న కొద్దీ ప్రకృతిలోని స్థిరత్వాన్ని, మానవ జీవితంలోని అస్థిరత్వాన్ని గ్రహించాడు. 'కృష్ణవేణి' కవిని చూచి 'ఏదీ నాతోపాటు కాస్త పొంగు' చూతామని అంటే


శా. 'ఈ ఆషాఢ నవాంబుదార్భటులతోనేకశ్రుతిం గల్పి త
ల్లీ, ఈరీతిగ నిత్యయౌవనసుధాశ్రీరాగ మాలాపనల్
చేయంజాలితి వెన్నిమారు లిటులన్ జీర్ణించు నా బోంట్లకుల్
ప్రాయం బింత చిగుర్ప నేరితివె అంబా, కృష్ణవేణీ నదీ!'


566

వావిలాల సోమయాజులు సాహిత్యం-4