అని చిన్నపిల్లవాడు తల్లితో ఎక్కడికో తీసుకు పొమ్మని గునిసి, తీసుకుపోతానంటే పట్టరాని సంతోషంతో గంతువేసి కేక వేసేటట్లుగా కృష్ణానదీ సైకతాలలో వెర్రిగా తిరిగాడు. ఈ స్థితిగతులు 'ఉద్బోధము' నాటికి మారిపోయినవి. అప్పుడు ఆయన ఒక కొత్త సత్యాన్ని కనుక్కున్నాడు.
“సంద్రమున సూర్యునిలో నాకసమున గాలి జుక్కలను, చందమామలో జూడవచ్చి పక్షి జీవంబులోన వెన్నెలలోన ఊరి దంపతులలో కుటీరమందు స్థిరపడిన గొప్ప ప్రకృతి చిత్రంపురూపు కానగా వచ్చె - నాలోన కానవచ్చె ప్రత్యణువునందు సైతము ప్రకృతి యెల్ల నిమిడియుండుట ఇప్పుడే యెరిగినాడ ఇంతవరకును పుట్టంధు పట్టులుంటి”
అని చెప్పాడు. ఈ పరిజ్ఞానము అందరికీ కలుగదని గీతలో పరమాత్మ శ్రద్ధావాన్ లభతే జ్ఞానమ్' అని చెప్పినట్లు
'ప్రకృతి మహనీయ రూప మెల్లెడల కలదు
కనులు గలవారు మాత్రము కాంచగలరు'
అని విశదీకరించాడు. మహాకవి A.E. ప్రకృతి ఇట్టి వైచిత్ర్యాన్ని జూచినపుడు
'One Thing in all things have I seen
One thought has haunted earth and air'
అని అన్నాడు. ఆంగ్ల సారస్వతంలో వర్డ్సు వర్తు కవికి ఈ అనుభూతి చిన్ననాడే కలిగింది. యౌవనంలో కవికి ప్రకృతి సంబంధం తగ్గిపోయింది. దానికి కారణము 'హర్షావహ నవ్యభవ్య వివిధాశయముల్ మధుర ప్రయత్నముల్' కొంత కాలానికి చిత్తవృత్తిలో మార్పు కలిగి మళ్ళీ ప్రకృతిమాతను మోహాంధుడైన నీ కుమారుణ్ణి తిరిగి ఏలుకోవలసిందని ప్రాధేయపడతాడు. ప్రకృతికీ తన జీవితానికీ ఉన్న సంబంధాన్ని, ప్రకృతి కవిత్వాన్ని మానినందుకు బాధ పడుతూ చెప్పిన 'పునరావర్త'మనే ఖండకావ్యంలో ఉట్టంకించాడు. ఇది మహాకవి వర్డ్సువర్తు 'టిన్ టరన్ ఆబీ' మీద చెప్పిన కావ్యం వంటిది. అందులో -
సాహిత్య విమర్శ
565