అని కనబడుతున్నది. నవ్య సాహిత్యంలో ఆ నాటికి ప్రచురణ అయిన గ్రంథాలు : రాయప్రోలు కావ్యావళి 1913-14, అబ్బూరి మల్లికాంబ 1915, బసవరాజు సెలయేరు 1916, ఊహాగానము, పూర్వప్రేమ 1917, 19-20 సంవత్సరాలలో ఏమీ ప్రచురణ కాలేదు. నోరి - శారద, సఖి, భారతి, ప్రతిభ మొదలైన పత్రికలలో గీతమాలిక తరువాత వ్రాసిన మరి కొన్ని ఖండకావ్యాలు ప్రచురించాడు. గీతమాలికలోని కావ్యాలన్నీ కవికి పందొమ్మిదేండ్లు నిండక పూర్వం వ్రాసినవే.
నోరి ఖండకావ్యాలన్నీ ప్రకృతి, ప్రేమ, భక్తి, మైత్రి, జీవితాలకు సంబంధించినవి. కొన్ని చరిత్రాత్మకమైన కథలు.
ఖండకావ్యాలుగా చెప్పిన కథలకు మూలము బౌద్ధ, గ్రీకు చరిత్రలు. కవి అయిదో ఫారము చదువుతుండగా ‘Children of the Dawn' అనే గ్రీకు పురాణ కథల మీద అపేక్ష విస్తారంగా కలిగిందట. అప్పటినుంచీ కనబడ్డ గ్రీకుకథల్లా చదివాడు. ట్రోజను యుద్ధకథలు కవి మనస్సులో బాగా నాటుకొన్నవి. తరువాత Derby హోమరు భాషాంతరీకరణము, Long వ్రాసిన గ్రీకు కథలు చదవటము సంభవించింది. Bury మహాశయుడు వ్రాసిన గ్రీకు దేశచరిత్ర చదివిన రోజులలో ఎన్నో కథలు ఆయన కవిత్వాన్ని ఆకర్షించాయి. రోమను చరిత్రకు గిబ్బను మహాశయుడు ఎటువంటివాడో, గ్రీకు దేశ చరిత్రకు బ్యూరీ అటువంటివాడు. ఆ రెండు దేశచరిత్రలూ సాహిత్య శ్రేణిలో పరిగణింపబడుతున్నవి. ఈ కృషికి ఫలితమే గ్రీకు చరిత్రలకు సంబంధించిన గీతమాలికలోని ఏయసు, ఈనను, జర్జీసు కావ్యములు. ఆధునిక ఆంధ్రకవులలో గ్రీకు తత్త్వాన్ని అవగాహన చేసుకొని వారి వస్తువుతో కావ్యాలు చెప్పినది ఈయన ఒక్కడే. మహాకవి హోమరు రచనాపద్ధతిని తన కావ్యాలలోకి తీసుకు రావాలని ప్రయత్నము చేసి, చాలావరకు సఫలీకృతుడైనాడు. నోరి మీద గ్రీకు వాఙ్మయ ప్రాబల్యం విషయాన్ని శ్రీ శివశంకర శాస్త్రి 'నాలో మార్పులో' గ్రీకునాఙ్మయం చదువుతున్న రోజుల్లో నోరి నరసింహశాస్త్రి అందులో కథావస్తువులు కొన్ని స్వీకరించి ఖండకావ్యాలు చేశాడు. నా కంటే అతను గ్రీకు (Spirit) బాగా గ్రహించాడేమో ననిపించింది' అని వ్రాశారు. నోరి గ్రీకు కథల్లో గ్రీకు పురాణకవిత్వానికి ముఖ్యగుణాలు - సౌలభ్యము, అవక్రత, వాస్తవికత (Realism) పట్టుకొని వచ్చాడు. బుద్ధదేవుని సర్వసంగపరిత్యాగానికి సంబంధించిన కథ 'వినిర్గమనము'. గ్రీకు కథలలో కన్నా దీనిలో కవి కళాతత్పరత బాగా కనిపిస్తుంది. ప్రకృతిని నేపథ్యరచనకు కవి రసోచితముగా వాడుకొన్నాడు, ఈ 'వినిర్గమనము'లో. ప్రకృతితో ఏదో ఒకవిధమైన సంబంధం లేని కవి అరుదు. కొందరు
సాహిత్య విమర్శ
563