Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/562

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

స్నేహభావంలోని ఆర్ద్రత సభ్యత్వానికి ప్రథమ లక్షణం. కేవలమూ కవులకే కాకుండా చిత్రకారులకు, కథకులకు, విమర్శకులకూ సమితిలో స్థానం ఉండేది. వివిధ సాహిత్య భాండారాలను, నూతన రచనలతో పాటు - కొల్లగొట్టి తమవశం చేసుకోవాలని సభ్యులు ఆశయంగా పెట్టుకున్నారు. కొందరు కొందరు కలసి ఒక్కొక్క సాహిత్యాన్ని నేర్చుకున్నారు. సమితి ప్రథమ సభ్యుల్లో నోరి ఒకడు. సమితిలో ఉన్న ఇప్పటి వాళ్ళందరిలోకీ చిన్నవాడు.

కవి మిత్రుల స్నేహం వల్ల నోరిలో 'కవిత్వపు పిచ్చి' వృద్ధి కాజొచ్చింది. ఆయన కవితాజీవితంలో ఆ రోజులు ఒక ImpressionableAge. ఏ విషయం కవిలో ఉద్రేకం కలిగిస్తే అదల్లా కావ్యమై కూర్చుండేది. నేటి ఆంధ్ర సాహితీలోకంలో సంస్కృతాంగ్లాంధ్ర సాహిత్యాలను విశేషంగా జీర్ణించుకున్న వాళ్ళలో నోరి ఒకడు. కన్నడంలో కూడా కొంత కృషి చేశాడు. ఆయన కలం కేవలము పద్యాలు వ్రాయటంతోనే ఆగిపోకుండా వివిధ సాహిత్యశాఖలను అనుసంధించుకున్నది.

తెలుగు సాహిత్యంలో చెప్పుకోతగ్గ కొన్ని కథలు వ్రాశాడు. ఆయన 'వీరుని కథ'లోని టెక్నిక్లో ప్రత్యేకత ఉన్నది. కథంతా స్వగతము (Dramatic Monologue) నడిచే పద్ధతిలో నడిచింది. వచన నాటికారచయితలలో తనకొక ఉన్నతస్థానాన్ని కల్పించుకున్నాడు. ఆయన పద్యకావ్యాల కన్నా వచననాటికలు - సోమనాథ విజయము - ఖేమాభికుని - పతంగయానము పఠితల దృష్టిని ఎక్కువగా ఆకర్షించాయి. ఈ మధ్య 'భాగవతావతరణము', 'షణ్ణవతి' వంటి పద్యగీతి నాటికలు కూడా వ్రాయటము ప్రారంభించాడు. విమర్శనవిషయంలో ఆయన తీవ్రవాది. ఉపదేశార్హత లేనిదే కవిత్వం చెప్పకూడదని ఆయన మతము. అంతమాత్రముతో వచ్చే రచనలనన్నిటినీ త్రోసిరాజనడు. ఏ మాత్రము గుణమున్నా గ్రహించి మెచ్చుకొని, తీరుతాడు.

నోరి ఖండకావ్యాలు కొన్ని కలిపి 'గీతమాలిక' అనే పేరుతో సాహితీ సమితివారు 1921లో ప్రచురించారు. మొదట దీనికి 'రసాల' మని నామకరణము చేసి, తరువాత ఏ కారణమువల్లనో మార్చారు. అందువల్లనే గీతమాలికలోని 'శివశంకరునకు' అనే కావ్యంలో -

'నా వనమ్మున దోహదసేవ నీవు
సాదరమ్ముగ జూచు రసాల శాఖి”


562

వావిలాల సోమయాజులు సాహిత్యం-4