పర్వదినాలలో ఉపవాసాదులూ దేవదర్శనము, కార్తిక మాసములో ఏకోత్తర వృద్ధిగా దీపారాధన, ఆకాశ దీపము ఇత్యాదులతో కాలం గడిపేది. శ్రావణ శుద్ధ ఏకాదశినాడు పరలోకగతురాలైనది. 'ఏకాదశి' అనే కావ్యం ఏతత్ఫలితం.
పితృపక్షం నుంచి కొన్ని గుణాలూ, మాతృపక్షం నుంచి కొన్ని గుణాలు నోరికబ్బాయి. ఆయన జీవితంలో కలిగిన సంఘర్షణంతా పితృపక్షలక్షణాలకూ, మాతృపక్ష లక్షణాలకూ సంబంధించింది. మాతృపక్షమే బలవత్తరమైనది. మొదట కొంతకాలము కవి హృదయంలో పితృపక్ష లక్షణాలు పనిచేసినా, వయస్సు వస్తున్న కొద్దీ మాతృపక్షలక్షణాలకు సంపూర్ణ విజయ ప్రాప్తి గలుగుతున్నది. కొద్దిరోజుల క్రింద జగద్గురువుల వద్ద స్వీకరించిన 'పూర్ణదీక్ష'తో ఈ విషయం రూడైపోయింది. ఈ పక్షాల రెంటి లక్షణాలూ, వాటి సంయోగవియోగాలూ, నిమ్నోన్నతాలూ కవి రచనలలో ప్రతిఫలిస్తూనే వచ్చినవి.
పురాణ కవులనూ, వారి కవిత్వాన్నీ ఆదర్శంగా పెట్టుకొని కవిత్వము చెబుదామనుకున్న యువకవి దీక్షతో కలం చేబట్టాడు. కొన్ని ప్రబంధాలు చెప్పాడు. నవలలు, నవలా ప్రబంధ నాటకాలు, చిల్లర మొల్లరగా ఇంక నెన్నో కృతులల్లాడు.
శ్రీ శివశంకరశాస్త్రి నోరి అన్నగారికి తోడల్లుడు. పూర్వం నోరి స్వగ్రామం గుంటూరు. ఆ రోజుల్లో... శంకరశాస్త్రి గుంటూరు వచ్చినప్పుడు 'నీవు పద్యాలు వ్రాస్తావట, చూపించ' మంటే సిగ్గుతో చూపక తప్పుకున్నాడు నోరి. కానీ ఆయనమీద హృదయంలో ఏదో అభిమానం ఏర్పడ్డది. ఆ ప్రాంతములోనే ఒకటి రెండు రాత్రులు ఇష్టగోష్ఠిలో కావ్యప్రశంస వచ్చింది. దానితో నోరి హృదయాన్ని శ్రీ శివశంకర శాస్త్రి ఆకర్షించాడు. ప్రాచీన కవిత్వపు పోకడలకు స్వస్తి. నవ్య కవితాధోరణికి బీజాంకురము.
తరువాత కొన్నాళ్ళకు శ్రీ శాస్త్రితో పరిచయము కాకముందూ తరువాతనూ వ్రాసిన కావ్యాలలో కొన్ని మాత్రము అట్టేపెట్టి మిగిలినవన్నీ ఆయన నోరిచేత దహనం చేయించారు. నోరి కా పని అప్పుడిష్టము లేదు. కానీ ఆయన ప్రోద్బలం వల్ల చేశాడు. అందులో ఒక నవల పోయింది. కొన్ని ప్రబంధాలు పోయినవి. ఒక నవలాప్రబంధ నాటకము పోయింది. ఇక ఖండ కావ్యాలు లెక్క లేదు. అప్పుడే,
తే. 'రూపు మాత్రపుఁ బూలెన్నో రూపుమాసి
పోయిననె కాని పిందెపూల్ పుట్టబోవు
560
వావిలాల సోమయాజులు సాహిత్యం-4