ఈ పరార్థత వలననే గదా భ్రమరయువకుఁడు కృష్ణభగవానుని దూతగ నేఁగి
వల్లవీసంఫుల్లాబ్జనేత్రల వలన నపూర్వావమానము నొందినది! ఇందులకు సాక్షి
మఱియొకరు మఱియొకరు కాదు మన మహాభక్తకవి పోతనామాత్యుఁడు!
మ. 94[1]“భ్రమరా దుర్జనమిత్ర! ముట్టకుము మా పాదాబ్జముల్ నాగర
ప్రమదాళీకుచకుంకుమాంకిత లసత్రాణేశ దామప్రసూ
నమరందారుణితాననుండ వగుటన్ నాథుండు మన్నించుఁ గా
క మము న్నేపుచుఁ బౌరకాంతల శుభాగారంబున న్నిత్యమున్.”
ఇవి కదా వారన్న మాటలు! పాదముల నంటి దౌత్యమును నెఱపిన నెఱజాణతనము స్నేహార్ద్రత భ్రమరుని కడఁగాక యే దూతయం దున్నవి?
నలుఁ డేమొనర్చినాడు? దమయంతికడకుఁ ద్రిదశేశుల దూతగ నేఁగి 'యెన్ని చెప్పిన నామె యన్నింటి కన్ని చెప్పి' కన్నీరు పెట్టునంతకు 'దివిజోపకారసంస్తం భితవిప్రలంబ వేదనాభరుండై' సంభాషించుట మెచ్చుకొనఁ దగినదే! కాని యా విదర్భ రాజపుత్రి ‘యప్రతివిధానంబైన ప్రియావాప్తి విఘాతంబున... వేడియశ్రుల నిగుడంగ వెక్కి వెక్కి యేడ్వఁ (ధీరోదాత్తుఁడైన తాను) దన్నును, దన వచ్చిన కార్యంబును దన్నుఁ బుత్తెంచిన వేల్పులను మఱచి యవస్థావశంబున నుచితానుచిత వివేకంబులు దప్ప భావనానిరూఢంబులైన ప్రియావికల్పంబులు వికల్పించుచు:
కం. 95[2]"ఏమిటి కేడ్చెద వానన
తామరసం బెత్తి చూడు తరుణీ! నన్నున్
గోమలకటాక్షవీక్షా
దామకముల వీరసేనతనయుని నలునిన్.”
అని బయటఁబడిపోవచ్చునా? ఎంత విస్పష్టముగఁ బలికినాఁడు! మఱియొక నలుఁ డెవ్వరైన నుండవచ్చు నేమో! 'వీరసేన తనయుఁ' డఁట! కేవలము 'గోత్రస్థాలిత్యము'తో నూరకొనిన నదియుఁ గొంత మేలై యుండెడిది.
"కాంత యశ్రుబిందుచ్యుతి కైతవమునఁ
దివిరి బిందుచ్యుతక కేళిఁ దవిలె దీవు;
సారెసారెకు నాదు సంసారమును స
సారముగఁ జేయుచు మసారతారనయన!”
- ↑ 94. భ్రమరా దుర్జనమిత్ర - పోతనకృత భాగవతము - దశమస్కంధము - పూర్వ
భాగము - ↑ 95. (పుట 69) ఏమిటి కేడ్చెద - నైషధము ఆ. 4, ప. 89
కాంతయు బిందుచ్యుతి - పూర్వోదాహృతము ఆ. 4, ప. 90
____________________________________________________________________________________________________
56
వావిలాల సోమయాజులు సాహిత్యం-4