రెండవ రంగంలో ఆమె లేనిలోటు సహజ కోమలకంఠంతో నేపథ్యాన పాడినపాట వల్ల ఉన్నానని తీర్చింది.
చంద్రమౌళి తిరిగి రావటానికి వీలుండదేమో అన్నప్పుడు రుద్దకంఠంతో -
“ఇంక నా కేమున్నదీ లోకమందు
బ్రతికి యున్నను నేను ఫలమేమి కలదు
తొలగిపోవగ నాదు దుఃఖభారమ్ము
కాలకంఠా! ఇంక కబళింపు నన్ను”
అని దుఃఖించింది. నిరాశ, నిస్పృహ ఒక్క మాటుగా ఆవరించాయి. జీవితదీపం ఆరిపోయినట్లుగా తోచింది. రుద్రాక్షమాలిక కూడా లభించలేదు కొంత ప్రశాంతికోసం. చివరకు శివాజీవిగా మారిపోయింది.
12
నాటక కాలపరిమితి 30 గంటలు. ప్రదర్శనకు మూడు గంటలు పట్టవచ్చు. దేశభేదం లేకుండా రంగవిభాగం రమణీయంగా ఉంది. అన్నీ అప్పయదీక్షితులు గృహావరణంలోనే.
పద్యనాటికలో ప్రకృతివర్ణనకు ప్రత్యేకస్థానం లేదు. అందువల్లనే కనిపించదు. కానీ నేపథ్యరచనకు చాలా ఉపయోగపడ్డది.
నాటికలో సాధారణంగా ప్రాప్త్యాశ, నియతాప్తి రెండే సూచితమౌతవి. ఈ నాటికలో కూడా అంతే.
మనోహరభావాలు, మధురఛందస్సులు, మానసిక తత్త్వపరిజ్ఞానము, పాత్రపోషణ, గభీరత, క్వచిదలంకారాలు, నిశ్చితాభిప్రాయము, నియమితాశయము నాటికలోని నానాగుణాలు.
“దీక్షిత దుహిత” తెలుగు సాహిత్యాకాశంలో దివ్యతార. అందులోని అందాలను అవగతం చేసుకొని ఆనందించటము భావ్యము.
“అలౌకికోల్లేఖసమర్పణేన
విదగ్ధ చేతః కషపట్టికాసు ।
పరీక్షితం కావ్యసువర్ణమేత
లోకస్య కంఠాభరణత్వమేతు! ||"
సాహిత్య విమర్శ
557