Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/555

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

“నా ప్రేయసీ పదన్యాస సౌభాగ్య
మొందిన ఈ మందిరోపవనంబు
శ్రీ ప్రయాగమహత్త్వసిద్ధిచే సర్వ
దేవతలకు కూడ తీర్థరాజంబె”

ఎంత పరిపూతభావము అతని మనస్సులో ప్రభవించింది! కవితాత్మ కలవాడనటానికి వేరే కారణాలు కావాలా?

"అనిమిష దుర్లభంబైన ఆదివ్య
మంగళ విగ్రహ మంజుహస్తంబు
గ్రహియించు భాగ్యమ్ము కలుగు టేలాగొ?
పెనగొను సంభ్రమ భీ విస్మయాలు!"

తన హృదయాన్ని దత్తం చేశాడు కాని, ఆమె హృదయం ఎటువంటిదో అవగతం కాలేదు. 'గురు పుత్రి అనే గూఢభయం వల్ల' సంభ్రమ భీతి విస్మయాలు పెనగొన్నవి.

ఆ రోజులలో ఇటువంటి ప్రణయగీతాలు వ్రాసే వారేనా అనే అనుమానం అంకురించవచ్చు. అప్పయ దీక్షితుల బంధువు, బహుశః నీలకంఠ దీక్షితులు ఒకనాడు స్త్రీ పరంగా -

"అకృశం కుచయోః కృశం వలగ్నే
విపులం చక్షుషి విస్తృతం నితంబే,
అధర్గేరుణ మావిరస్తు చిత్తే -

అని వర్ణిస్తుండగా ఇంతలో ఆయన చూచి ఏమిటంటే

"కరుణాశాలి కపాలిభాగధేయం”
అని పూర్తిచేస్తే సంతోషించాడట!

పరస్పర హృదయదత్తానంతరం చంద్రమౌళి గురువుగారికి తెలిస్తే “మంగళమో మరణమో” అనే అంతరంగయుద్ధంలో ఆగిపోయినాడు.

“కుసుమకోమల”మైన మానసానికీ, “స్థైర్యవిరహిత” చిత్తానికీ ఉన్న సూక్ష్మాన్ని గ్రహించిన సునిశితబుద్ధి అతనిలో ఉంది.


సాహిత్య విమర్శ

555