తర్కశాస్త్ర వేత్త కావటం చేత తూచి మాట్లాడుతాడు. తొందరపడడు.
“మంచిదమ్మా పోయి
మంగళకు పరిణయము
చేయ నవకాశమ్ము
సిద్ధించు నని చెప్పు!"
అవకాశమని అన్నాడు కాని నిశ్చితాభిప్రాయంగా చెప్పలేదు. మరకతవల్లి మామూలు మనిషి కాబట్టి మంగళార్థం గ్రహించింది.
పునర్వివాహం చేతామన్న బుద్ధి పోయినంత మాత్రానికి కాలుష్యం ఆయనను క్రమ్మినట్లు తోచింది. కాలకంఠేశ్వరాలయం కట్టించి పరిపూతుడైనాడు. శిష్య వాత్సల్యం జీర్ణించుకున్న దీక్షితులు, చంద్రమౌళికి “పూర్వబంధములును పూర్వవాసనలను కోసి, కడిగి వేసికొనుట శుభము" అని అభిప్రాయమిచ్చాడు.
వ్యంగ్య సంభాషణ ఆయనలో వ్యక్తి తాల్చింది.
“సకలతాపహారి స్మరహరు కరుణచే
శర్మ మగుత నీకు చంద్రమౌళి!”
సకలతాపహారి, స్మరహరశబ్దాలవల్ల కామాన్ని తొలగించుకోమని సూచన. ధర్మసూక్ష్మము, ధర్మనిర్ణాయకులు కారుణ్యము, వారి దృక్పథము గ్రహించి
తే.“కాదు కాదు సుమా! మహాకారుణికులు
ధర్మనిర్ణాయకులు, వారితలపు వేరు
ఇహము కన్నను పరమునకే విశేష
ఫలము లోకహితమ్ముగా తలచినారు”
అన్నాడు. ఎంత మాత్సర్యవిరహిత సూక్ష్మబుద్ది! ఆయనలో ఉన్న శాస్త్రాన్ని ఆచారము శాసించింది. చంద్రమౌళి సద్వంశ సంజాతుడు. శాస్త్రవ్యసనము సంస్కృతి, పరిశుద్ధ వర్తనము, గురుభక్తి, పవిత్రప్రేమ అతనిలోని అమరగుణాలు.
మంగళాంబ మీద మనసు పోయినప్పటినుంచీ మరో కన్య మాటే లేదు. పెద్దలమాట పెడచెవి పెట్టే స్థితికి చేరుకుంటున్నాడు.
554
వావిలాల సోమయాజులు సాహిత్యం-4