Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/553

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తప్పించిన ఓ
దయాసాగరా!”

అన్న వాక్యం కనిపిస్తుంది.

దశమాధిపతికి స్వక్షేత్రంలో ఉచ్చస్థితి కలిగితే జాతకుడు మహారాజసము డౌతాడని శాస్త్రం. అప్పయదీక్షితుల మీద ఔత్తరాహకవి అన్న,

శా. “నానా దేశ నరేంద్రమండల మహా యత్నాతిదూరీభవ
త్కాదాచిత్క పదారవిందవినతే రప్పయ్యయజ్వప్రభోః |
శైవోత్కర్ష పరిష్కృతై రహరహ స్సూక్లెస్సుధాలాలితైః
ఫుల్లత్కర్ణపుటస్య బొమ్మనృపతేః పుణ్యాని గణ్యాని కిం |"

అనే శ్లోకాన్ని చూస్తే మహారాజసముడే కాడు “నానాదేశ రాజన్య మండలానికి అనేక ప్రయత్నాల వల్ల నమస్కరించటానికి తగిన పాదారవిందాలు కలవా" డని తెలుస్తుంది.

జాతకచక్ర ప్రభావంవల్ల జగన్మాన్యత గడించాడు. అందరాని పదం అధిష్ఠించి అపరశివావతారమైనాడు.

11

వంశంలోనూ, విద్యావైభవంలోనూ, అప్పయ దీక్షితులు అసామాన్యుడు. గాంభీర్యము, ఔదార్యము, అనుకంప ఆయనలో పుంజీభవించాయి. అఖిలాగమ పారగుడు అవటం చేత ఎదురాడటానికి ఎవరికీ సాహసం లేదు. కవితాత్మకలవాడు కావటం వల్ల కవి ఆయన చేత

తే. "నాకలో కాంగనా వీటి కాకరండ
మండితోన్నత నవసుధాఖండమట్లు
విరియుచున్నాడు శశి ఉడువీథియందు
కళలు, త్రిజగదుద్దీపన కారణుండు”

అనే ముక్తకము అల్లించాడు. మంగళాంబ పాటలో ఉన్న మాధుర్యాన్ని గ్రహించిన సంగీతజ్ఞాని. ఆంధ్రభాషలోని అతిమనోహరత్వ మవగతం చేసుకున్నాడు. కర్మదీక్షితుడైనా కారుణికుడు.


సాహిత్య విమర్శ

553