ఒకే గ్రహానికి ఉచ్చస్థితి పట్టి నీచస్థితి కూడా పట్టినట్లైతే, నీచగ్రహం పరిపూర్ణ శుభుడౌతాడు. అందువల్ల ఈ జాతక చక్రంలో గురుడు పరిపూర్ణశుభుడు.
ఆరూఢ పంచమంలో గురుడుంటే జాతకుడు సర్వజ్ఞుడు, గ్రాంథికుడు, వ్యాకరణం వేదాంతాది శాస్త్రవేత్త, వక్త ఔతాడని శాస్త్ర ప్రమాణము.6
దీక్షితుల జాతక చక్రంలో ఆ స్థితే ఉన్నది. అంతే కాకుండా ఆరూఢంలో రవి ఉండటం వల్ల వేదాన్త విద్యతో పాటు సంగీత శాస్త్రజ్ఞానము అబ్బుతుంది. తత్ఫలితంగా 'శివార్కమణి దీపికా' రచనచేసి శివాద్వైత స్థాపనాచార్యుడైనాడు. చినబొమ్మరాజు కనకాభిషేకం చేశాడు. శివాద్వైత నిర్ణయము, రత్నత్రయపరీక్ష, అద్వైతదీపిక - ఆది శతాధిక గ్రంథాలు బయలుదేరాయి. కుజుడు ఆరూఢ పంచమాన్ని అష్టమ దృష్టితో చూడటం వల్ల, ఖండదేవుని వంటి మీమాంసకుడే ఆయనను 'మీమాంసక మూర్ధన్యు' డన్నాడు. కావ్య నాటకాలంకార కారకుడు - శుక్రుడు ద్వితీయంలో - అంతేకాకుండా - స్వస్థానము, మూల త్రికోణము - ఉన్నాడు. దీక్షితులు దివ్యమైన కవి. పరశ్శత గ్రంథకర్త. కువలయానందము, ఆనందలహరి, అపీత కుచాంబాస్తవము తదితర కావ్యచయం అందువల్ల అవతరించింది. లగ్న, ఆరూఢలగ్నాల్లో బుధస్థితివల్ల జ్యోతిష శాస్త్ర విదుడవుతాడు." ఆ సంగతి గమనించి శ్రీ శాస్త్రిగారు దీక్షిత దుహితకు వివాహం కాకపోవటానికి కారణంగా ఆయన చేత
"కూడియున్నవారు కుజ, శని, రాహువు
అష్టమమ్మునందు అందువలన
తప్పిపోవదాయె దానికి వైధవ్య
బాధ విధికృతాన బాల్యమందె”
అనిపించారు. ఇలా చెప్పించటం కావ్యానికెంతో కళ తెచ్చింది.
యజనకారకుడు గురుడు నీచలో పడటం వల్ల దీక్షితులు విపరీత సంప్రదాయజ్ఞకర్త ఐనాడు. యజ్ఞపశువును చంపి వపాహోమం చేయవలసి వుంటుంది. అలా చెయ్యకపోతే యజనం పరిసమాప్తి పొందినట్లు కాదు 'కరుణావార్నిధి' కావటం చేత అది జరగలేదు. అగ్ని ప్రత్యక్షమై వప స్వీకరించినట్లు జనశ్రుతి. ఆ ఆధారాన్ని అనుసరించే వితంతువుల స్వరమేళలోని
“యజ్ఞ పశువునకు
ఆలంబనమును
552
వావిలాల సోమయాజులు సాహిత్యం-4