Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/551

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

అప్పయ దీక్షితుల వంశవృక్షం చూస్తే వైదిక కర్మల ప్రత్యయము - దీక్షిత, అధ్వరి - ఇత్యాది, కనిపిస్తుంది. యజ్ఞకర్తలు, సదాచారసంపత్తి కలవారు.

అప్పయ దీక్షితుల పితామహుడు అచ్చాదీక్షితులు (అచ్చన్న దీక్షితులు - ఆచార్య దీక్షితులు) 'వక్షఃస్థల మవైక్షత' అనే పాదం గల శ్లోకరచనం వల్ల ఆయనకు 'వక్షఃస్థలదీక్షితు' అనే బిరుదనామం కూడా వచ్చింది. అప్పయదీక్షితులు వ్రాసిన

“ఆసేతు బంధతట మాచ తుషారశైలా
దాచార్య దీక్షిత ఇతి ప్రథితాభిధానమ్ ।
అద్వైతచిత్సుఖమహాంబుధిమగ్న భావ
మస్మ ృత్పితామహ మశేషగురుం ప్రపద్యే! ॥”

అన్న శ్లోకం ఆయనమీదిదే. అచ్చాదీక్షితులు కృష్ణరాయల ఆస్థానం అలంకరించాడట. దీక్షితుల తండ్రి రంగరాజాధ్వరి. 'అద్వైత విద్యాచార్యుడు. ' వివరణ దర్పణము, అద్వైత విద్యాముకురము ఆయన గ్రంథాలు.

"యం బ్రహ్మ నిశ్చితధియః ప్రవదన్తి సాక్షా
త్తద్దర్శనా దఖిల దర్శన ప్రారభాజః |
తం సర్వవేదసమశేష బుధాధిరాజం
శ్రీ రంగరాజమఖినం పితరం నతో స్మి! ॥"

అని తండ్రిని గురించి అప్పయ దీక్షితులు అన్నాడు. వారి గ్రామం అడయప్పళము. అంటే ఆదెప్పపాలెం. వైదిక సంప్రదాయం గల వంశంలో జన్మించి అప్పయ దీక్షితులు అఖిలాగమపారగుడై అధ్వరకర్త ఐనాడు.

జ్యోతిష శాస్త్ర పరిచయం కలవాళ్ళకు ఆయన జాతకచక్రం చూస్తే విద్యావిశేషము బయటపడుతుంది.


Caption text
శీర్షిక పాఠ్యం శీర్షిక పాఠ్యం శీర్షిక పాఠ్యం
గడి పాఠ్యం గడి పాఠ్యం గడి పాఠ్యం
గడి పాఠ్యం గడి పాఠ్యం గడి పాఠ్యం
గడి పాఠ్యం గడి పాఠ్యం గడి పాఠ్యం

సాహిత్య విమర్శ

551