ఈ పుటను అచ్చుదిద్దలేదు
మళ్ళా వృద్ధ బ్రాహ్మణ స్వరమేళ. మొదట ఉన్న దౌర్జన్యం ఈ స్వరమేళలో లేదు. వాంఛాపూర్వకంగాను, పక్షద్వయ నిరూపణ పూర్వకంగాను కనిపిస్తుంది.
నీవే ఈ విధి
నిర్ణయించునెడ
పాతివ్రత్యము
భంగము కాదా!
భువనములో నీ
పుత్రి పునర్భువు
అనెడి కళంకం
బంటకుండవలె!
ఆలోచింపుము
అప్పయదీక్షిత
ధర్మము ముఖ్యమొ
తనయయె ముఖ్యమొ
కాయిక సౌఖ్యము
ఘనమో, నిర్వృతి
కారణధర్మము
ఘనమో తలపుము!
దీనితో దీక్షితులు దయావీరాన్ని త్యజించి ధర్మవీరుడైపోయినాడు. 'ఆర్యధర్మవిదా' అని సంబోధించి వృద్ధ బ్రాహ్మణులు ఆయనను నాయకుణ్ణి చేసి భారం వేశారు. ధర్మరథ చోదకుడై -
సాహిత్య విమర్శ
549