ఈ పుటను అచ్చుదిద్దలేదు
అగ్నిని దుముకుదు
మానతి యగుచో
ఆ సమయంలో ఆచారం మీది దృష్టి శాస్త్రం మీదికి తిరిగింది. యువకులు తన కండగా ఉన్నారనే ఉత్సాహం కలిగింది. వీళ్ళకు పెళ్ళి చేదామనే భావాంకురం పడటానికి అవకాశం కలిగింది. కానీ ఇంకా ద్వైవిధ్యము ఆయనను బాధిస్తూనే ఉంది. అప్పుడు వితంతువుల స్వరమేళ.
అబ్దసహస్రము
అరిగిన మీదట
అరుగుదెంచు నీ
అమరనిమేషము!
మీ కారుణ్యా
మృత సేకమ్మున
పుట్టుదురుత్తమ
పురుషులు స్త్రీలును
చిన్ని యనదలకు
జీవన్మరణము
తొలగింపుడు
మీదుహితృప్రేరణ
వితంతు స్వరమేళ విన్న తరువాత దీక్షితుల హృదయం దయాసాగర మైపోయింది. ఆయన అంతరంగంలోని అమృత కలశం ఉప్పొంగింది. ఇది రెండోదశ. సరసవాణితో వివాహం చేయటానికి అవకాశమున్నదని మరకతచేత చెప్పి పంపిస్తాడు. అంతలో
548
వావిలాల సోమయాజులు సాహిత్యం-4