ఉత్సాహం నిర్వేలమైనప్పుడు శాస్త్రిగారు ముక్తపదగ్రస్తం చేస్తారు. ఉదాహృతి మంగళ పరిణయానికి అవకాశ మున్నదని దీక్షితులు నిర్ణయించినప్పుడు సరసవాణి సంతోషంతో ప్రవేశించి .
"మెచ్చుకోతగినది
మీ నిర్ణయమ్ము!
మీ నిర్ణయమ్మున
మిగుల హర్షమ్ము!
మీ నిర్ణయమ్మున
మిగిలినవారు
మిగుల హర్షము గాంత్రు
మేదినీస్థలిని”
అని అంటుంది. నిర్ణయశబ్దం ముమ్మాటు ఉద్దీప్తి కోసం పునరుక్తమైంది. మీ, మె, మేలు విరివిగా వాడటంలో సంగీత సంప్రదాయం ఉంది. కావ్యంలో Musical Element కల్పించటానికి కవులు వాడే పద్ధతులలో ఇది ఒకటి. ఇటువంటివి స్వరమేళలలో ఎన్నో కనిపిస్తవి.
పాదపూరణకోసం సంబోధన పారవేయటము కవులకు పరిపాటి. కవి రసావేశము ఉంటేనే గాని ప్రయోగించడు.
9
'స్వరమేళ' శబ్దాన్ని (Chorus) అర్థప్రతిపాదకంగా కవి ప్రయోగించాడు. అంటే అనేక కంఠాలు కలిసి పాడటమన్నమాట. వేదాధ్యయనంలో 'సహ పాఠ్యమనేది ఒక పద్దతి. చతుష్షష్టి కళలలో కూడా ఒకటి. మంత్రం కానీ, యజుస్సు కానీ ఒకరు చదవటం ప్రారంభిస్తే తక్కినవారు కలిసి చదవటం 'సహపాఠ్యం.' శ్రీ శాస్త్రిగారి 'స్వరమేళ' శబ్దానికి 'సహపాఠ్య' శబ్దం పర్యాయపదంగా వాడవచ్చు.
'అజాతశిశు స్వరమేళ'తో కూడా నాలుగు సహపాఠ్యాలు పెడదా మనుకున్నారట. కానీ కారణాంతరాలవల్ల దీనిని మానివేశారు. ప్రస్తుతము మూడే - వృద్ధ బ్రాహ్మణ స్వరమేళ - యువబ్రాహ్మణ స్వరమేళ - వితంతు స్వరమేళ. గ్రీకు Chorus కూ,
సాహిత్య విమర్శ
545