Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/544

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మొదటి సూక్తులు తదుపరి లోకోక్తులుగా మారుతవి. శ్రీ శాస్త్రిగారి సూక్తులు కొన్ని ఇదివరకే లోకోక్తులైనవి. 'దీక్షిత దుహిత' లోని మరికొన్ని లోకోక్తులు.

"కుసుమకోమల మైన మానసము వేరు
స్థైర్యవిరహిత మైన చిత్తమ్ము వేరు”

తే. "లోక సంగ్రహబుద్ధి వివేకులైన
ధర్మవేత్తలు చూపిన దారివెంట
చనెడివారల కొక్కింత శ్రమమె యైన
తుదకు నిశ్రేయసప్రాప్తి ధ్రువము సుమ్ము”

తే. "ధర్మమార్గమునందు పాదములు సుఖము
పొందు నభిలాష కెట్టి పుప్పొడులు లేవు,
కానబడును వికీర్ణమై కంటకములు
గాటముగ నొప్పులెత్తించు కరకురాలు”

సందర్భానుగుణమైన చమత్కారము, చతురోక్తులు ఈ నాటికకు అలంకారాలు.

తే. "ముగ్ధహరిణాక్షి నే చతుర్ముఖుడగాను
సిద్ధుడను గాను దృష్టి విశేషమునకు”

శ్రోత్రియ వాతావరణంలో పెరిగిన పిల్లలకు చమత్కారం ఉండదంటారా?

"ఆహవముఖమునం దర్జునునట్లు
నిజకుమారి వివాహ నిర్ణయమందు
వెనుకంజవేసిన విప్రవీరునకు
గీతోపదేశ మే కృష్ణుండు చేయు!”

"మాటి మాటికి మీరు మారినరీతి
మరల నీవారము మారిపోరాదె!"

'దీపకళిక', 'అమృతవాక్కు', 'సుప్రభాతము', 'చల్లని వేళ', 'పుణ్యవేళ', ప్రశాంతవేళ, దివ్య, భవ్య, నవ్య, నవీన, నూతన, అభినవ తదితర శబ్దాలమీద శాస్త్రిగారికి అనుకోని అభిమానమున్నట్లు ద్యోతక మౌతుంది.


544

వావిలాల సోమయాజులు సాహిత్యం-4