Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/542

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నాయకుడూ అంతే. మంగళాంబతో మనసు కలిపిన తరువాత ఆమె మంజరితో మాట్లాడితే మంజరిలోను, ముత్యాల సరాలలో మాట్లాడితే ముత్యాల సరాలలోనూ మాట్లాడాడు. నాయికా నాయకుల అంతరంగం ఒకటైనప్పుడు ఛందస్సు మాత్రం ఒకటి కావద్దూ?

ప్రకరణానుగుణంగా ఛందస్సులో పరిపరివిధాల నడక నాటికారచనలో గొప్ప నగిషీ పని.

సహపాఠ్యంగా చదవదగిన స్వరమేళలు మధురగతి రగడ నడకలతో మధురంగా నడిచాయి. స్వరమేళలలో ఆ వేగం ఉండటం చేత అష్టమాత్రాపరిమితమైన పాదాలు వాడటంతో శ్రవణసౌఖ్యం ఏర్పడ్డది.

“దీక్షిత దుహిత" ప్రధానంగా పద్యనాటికైనా పద్య ప్రాయాలైన గీతికలు రసాతిరేకం కలిగిన ఘట్టాలలో కవిప్రయుక్తాలైనవి.

దేశీయ ఛందస్సులు ఎంత విరివిగా వాడతారో శ్రీ శాస్త్రిగారిలో జాతీయ పదప్రయోగం అంత తక్కువ. సంస్కృత ప్రీతి అధికము. భాష సంస్కృత భూయిష్ఠమైనా కొన్ని సందర్భాలలో అప్రయత్నంగా తెలుగు పదాలు, జాతీయాలు పడతవి.

చెన్ను, పాలుమాలిక, పెడచెవిబెట్టు - ఇత్యాదులు పదాలు.

“ఈ అరుంతుదజీవన మెట్లు గడచు
ముక్కుపచ్చలె ఆరని ముద్దుబిడ్డ
కక్కటక్కట ఏల బాల్యమ్మునందె
చేసినారో వివాహమ్ము శీఘ్రపడుచు
చూచు చుండగ సంసార సుఖములందు
మునిగితేలెడి పెద్దల, ముద్దుబిడ్డ
ఊర్మిళవిధాన నిద్రలో నుండవలెనే;
దైవతాంశాభవము కదె దయ మహాత్మ!
జరిపి చెల్లి వివాహమ్ము సత్వరముగ
దాని క్రమ్మర నొక ఇంటిదాని జేసి
సంతసింపగవలసిన సమయమందు
కలుగ నేటికి ఇంతటి కలత మీకు


542

వావిలాల సోమయాజులు సాహిత్యం-4