శైవ వాతావరణానికి ఎంతో పట్టిచ్చింది. నటరాజవిగ్రహం నాల్గోది. నేపథ్యంలో మంగళాంబ
“యస్యాహు రాగమనిదః పరిపూర్ణ శక్తే
రంశే కియత్యపి నివిష్ట మముం ప్రపంచమ్ |
తస్మై తమాలరుచి భాసుర కన్ధరాయ
నారాయణప్రియసఖాయ నమశ్శివాయ ||"
అని శివస్తోత్రము చేయటము ఇంకో శోభ తెచ్చింది.
"జీయా త్కృతానఙ్గ పతఙ్గదాహః -
ఖట్వాంగినో నేత్రశిఖిప్రదీపః
యస్యాన్తికే శుభ్ర దశా నివేశ
శ్రియం కిరీటేన్దుకరాశ్రయంతే! ॥”
(మంఖుని శ్రీకంఠ చరితము)
“చూడోత్తం సితచారుచంద్రకలికా చంచచ్చిఖాభాస్వరో
లీలాదగ్ధవిలోలకామ శలభ శ్రేయో దశాగ్రే స్ఫురన్ ।
అంతః స్ఫూర్జ దపార మోహతిమిర ప్రాగ్భార ముచ్చాటయన్
చేతస్సద్మని యోగినాం విజయతే జ్ఞానప్రదీపో హరః"
“మనస్తే పాదాజ్ఞే నివసతు వచః స్తోత్రఫణితౌ
కరశ్చాభ్యర్చాయాం శ్రుతిరపి కథాకర్ణన విధౌ
తవధ్యానే బుద్ధి ర్నయనయుగళం మూర్తివిభవే!”
(భర్తృహరి - వైరాగ్యశతకము) (ఆచార్య శంకరుడు - శివానందలహరి)
అనే మహా మాహేశ్వర కవుల వాక్యాలు పాత్రలచే పలికించటం వల్ల, అంతా శివమయ మైపోయింది.
భావోద్రేకం కలిగినప్పుడూ, ప్రార్థనాసమయంలోనూ, తెలుగు భాష తేలిపోతుంది.
అందుకు అమరవాణి అత్యంతోపయుక్తమని మహాకవులు శ్లోకాలు కవి ఉదాహరించాడు. నిజం కూడా అంతే.
540
వావిలాల సోమయాజులు సాహిత్యం-4