Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/539

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కంచి వరదరాజనుతి, కృష్ణ ధ్యానపద్ధతి వ్రాసి మొదట్లో వైష్ణవుడనిపించు కున్నాడు; తరువాత అద్వైతిగా మారిపోయినాడు అప్పయదీక్షితులు. అందులో శివప్రీతి క్రమేపీ ఎక్కువైపోయింది.

“మహేశ్వరే నా జగతా మధీశ్వరే
జనార్దనే వా జగదంతరాత్మని ।
అభేదబుద్ధి ప్రతిపత్తి రస్తిమే
తథా పి భక్తి స్తరుణేందు శేఖరే ॥"

అన్నాడు. శంకరుని అపరావతారాలని అనిపించుకున్న వాళ్ళకు శివపక్షపాతం పరిపాటే. ఆచార్య శంకరుడూ అంతే.

"సహస్రం వర్తంతే జగత విబుధాః క్షుద్రఫలదాన మన్యే స్వప్నే వా తదనుసరణం త్వత్కృతఫలమ్, హరి బ్రహ్మాదీనా మపి నికట భాజా, మసులభం చిరం యాచే శంభో! శివ, తవ పదాంభోజభజనమ్" అని అన్నాడు. శివపక్షపాతం మూలాన జన్మించిందే అప్పయదీక్షితుల “శివార్క మణిదీపిక.” ఈ గ్రంథరచనతో అద్వైతానికి అండపోయింది. నర్మదా తీరంనుంచి నరసింహయతి వచ్చి ప్రార్థిస్తే, దీక్షితులు బ్రహ్మసూత్రాలకు 'పరిమళ' వ్యాఖ్య వ్రాసి అద్వైతానికి అండగా నిలవబడ్డాడు. ఆయన శివపక్షపాతం ఎంత వరకు పోయిందంటే, ఆంధ్రులలో శిష్టులు ఆడవాళ్ళను వశి! వశి! అని అనేక తడవలు పిలవటం వల్ల శివ! శివ! శభోత్పత్తి కలుగుతుంది; అందువల్ల ఆంధ్రభాష అందమైనదని ఛలోక్తిగా అనేవరకూ.

ఇలాంటిదే కవి విషయంలో కూడా జరిగింది. ఆయనకూ అర్ధనారీశ్వరుని మీద అభిమానం ఎక్కువ. కంతేరులో మహేశ్వరాశ్రమం స్థాపించినప్పుడు అర్ధనారీశ్వరాలయం కట్టించాలనుకున్నారు అంతరాయాలవల్ల ఆగిపోయింది. ఎక్కడో విందుకుపోతే భోజనాంతంలో సాంబారువంతు వచ్చింది. మొదట వద్దని తరవాత కావాలన్నారు. మిత్రులు కారణం అడిగితే “అరవ వాళ్ళదైనా సాంబారులో పవిత్ర సాంబ శబ్దం ఉంది. ఎలా ఒద్దనటం?” అని అన్నారట.

శైవవాతావరణాన్ని చిత్రించటానికి శ్రీ శాస్త్రిగారు అన్నివిధానాలూ అవలంబించారు. నామకరణం అందులో ఒకటి. 'చంద్రమౌళి' శైవగ్రంథాలు సంభాషణానుగుణంగా ఉట్టంకించటం ఇందొకటి. శివార్క మణిదీపిక, శిఖరిణీమాల, స్వరమేళలలో శివసహస్రనామంలో వలె శివపర్యాయపదాలు పదేపదే పలికించటం


సాహిత్య విమర్శ

539