శాసన ప్రమాణమున్నదని తెలిసింది. అందువల్ల పూర్వాభిప్రాయాన్ని మార్చుకొని జన్మకాలం క్రీ.శ. 1520 ప్రాంతంగా భావించి దానికి అరవై ఏండ్లూ కలిపి
కథాకాలం క్రీ.శ. 1580 ప్రాంతంగా మార్చారు. కానీ, అప్పయ దీక్షితుల జాతక చక్రం ఒకటి అనుస్యూతంగా వస్తున్నది. తన్మూలంగా ఆయన జన్మకాలం శ.క. 1475 ప్రమాదీచ సంవత్సర కన్యామాస కృష్ణ ప్రథమ వాసరము (18 Sep 1553 A.D.) ఉత్తరఫల్గునీ నక్షత్రం. ఈ పరిగణన ప్రకారం కథాకాలము క్రీ.శ. 1610 ప్రాంతమనటమే సమంజసము. కూతురికి పునర్వివాహం చేతామన్న కల్మషాభిప్రాయం కలిగినందుకు కాలకంఠేశ్వరాలయం కట్టించాలెనని అప్పయ్య దీక్షితులు అనుకొన్నట్లు కల్పించటం ఈ పరిగణన ప్రకారం పొసగదు. దీనిలో కవిప్రమాదమేమీ లేదు. ఆయన పూర్వమతాన్ని అనుసరించి ఉంటారు.
7
గంభీరమైన కథావస్తువు. పవిత్రప్రేమకు ప్రబల వృద్ధాచారము అడ్డుకట్ట. శాశ్వతవియోగము, ఆచారము చేతుల్లో శాస్త్రము అణగిపోయింది. దానికి దయాదాక్షిణ్యాలు లేవు. విగతభర్తృక ఐతే చాలు. ముక్కుపచ్చలారని బిడ్డని ముద్దన్నా లేదు దానికి. మళ్ళీ పెళ్ళి చేసుకొని మహాపతివ్రత అనిపించుకోవలసిన మంగళ 'ఊర్మిళ విధాన నిద్రలో ఉండ' వలసి వచ్చింది. ఊర్మిళకు నిద్ర నిత్యమూ లేదు. మంగళపని మహా అన్యాయం ఐపోయింది! ఆచారాన్ని అమర్యాద చేసి కవి మంగళకు మాంగళ్యం కట్టించేవారే. కానీ ఐతిహ్యం ఒప్పుకోలేదు.
కథానిర్వహణంలో కవి ముక్కాకలు తీరినవాడు. స్వానుభవలేశాలతో కథను సర్వాంగసుందరంగా చేసి గద్దెక్కించాడు. నాయికానాయకుల విప్రయోగం తప్పించలేక తలనొప్పితో కొన్నాళ్ళు బాధపడటము నాకు ప్రత్యక్షానుభవము. ఎప్పుడైనా హృదయం గల శ్రోతకు గానీ, పఠితకు గానీ కంటికి కన్నీరు కారకుండా ఊరుకోదు. అంతట ఆగితే ఆనందమే.
రంగస్థల ప్రసాధన రసికుడైన కవికే తెలుసు.
ప్రథమ రంగస్థలం ఆరామంలో సాయంకాలము. కవితాప్రసరణకూ, కామినీ గోష్ఠికీ కావలసింది అంతకంటే ఏముంది? మధువనంలో మంజరులను చూడగానే చంద్రమౌళికి మంజరీఛందస్సు మనస్సుకు తట్టింది. చెంగల్వలను చూచేటప్పటికి
సాహిత్య విమర్శ
537