చేతామన్నా వరుడు దొరకడన్నాడు అప్పయ దీక్షితుడు. చంద్రమౌళికి మంగళమీది ప్రేమ సరసవాణి చెప్పివేసింది. కొడుకులు, అల్లుడు ఏమంటారో అని ఆయన సంశయిస్తే అంతా మీ మాట వినేవాళ్ళేనని ఆమె అన్నది. బ్రాహ్మణ్యం ఏమంటుందో చూచికాని చెప్పలేనన్నాడు దీక్షితులు. ఇది ద్వితీయ రంగం.
మర్నాటి పగలల్లా బ్రాహ్మణ బృందం ఏమనుకున్నారో విన్నాడు. రాత్రి విశాలమైన గదిలో నటరాజ స్వామి విగ్రహం ముందు చింతామగ్నుడై కూర్చున్నాడు. వృద్ధ బ్రాహ్మణులన్న మాటలు నచ్చినవి. చివరకు పెళ్ళి చేయటానికి సాహసం లేదన్నాడు. చంద్రమౌళికి అంతరంగశుద్ధికోసం సేతుస్నానం విధించాడు.
చంద్రమౌళి సేతుస్నానానికి పోబొయ్యే ముందు మంగళాంబను కలుస్తాడు. తిరిగీ ఎప్పుడు వస్తారని ఆమె ప్రశ్న. ఎన్ని సంవత్సరాలకైనా వస్తానో రానో అని సమాధానము. అతని మెడలో రుద్రాక్షమాలికను జూపించి 'ఆమరణము ఆర్యాపదార్థమగుగాక!" అని మంగళ అన్నది. అతను ఇవ్వబోయి మళ్లీ ఏదో ఆలోచించి 'శంకరుడొక్కడే అర్చనీయు' డని అన్నాడు. అంతటితో ఆమె మనస్సు క్రుంగిపోతుంది. అతన్ని కనబడేవరకు చూచి పొంగి వచ్చే దుఃఖంతో నటరాజస్వామికి మోకరిల్లి, చేతులు జోడించి డగ్గుత్తికతో ప్రార్థిస్తుంది. అంతటితో నాటిక పరిసమాప్తమౌతుంది.
6
“అప్పదీక్షితార్యు లఖిల విద్యాగురుల్
ఆపరశివులు వారి అంతికమున
అభ్యసింప విద్య లాయువు చాలునే
ఎన్ని జన్మలైన నెత్తవలయు”
అనే చంద్రమౌళి మాటల్లో ద్యోతకమయ్యే పాండితీప్రతిభలు సంపాదించాలన్నా, ఆ నాడు ప్రఖ్యాతివహించిన "పదవాక్య ప్రమాణపారీణ" బిరుదం సంపాదించుకున్న గోవింద దీక్షితులవారితో వేదాంత తత్త్వవిచారణ జరపాలన్నా, నరసింహయతి తదితర యతీంద్రులకు కూడా నుతిపాత్రుడు కావాలన్నా, దీక్షితులు వయోవృద్ధయి ఉండాలి.
“అప్పయ దీక్షితేంద్ర విజయా” న్ని అనుసరించి క్రీ.శ. 1550 ప్రాంతంలో ఆయన జన్మించి ఉంటారని ఊహించి షష్టి పూర్తి చేసి, కథాకాలం క్రీ.శ. 1610 ప్రాంతంగా మొదట్లో భావించారు. తదుపరి శ్రీ కురుగంటి సీతారామయ్యతో సంభాషించినపుడు దీక్షితులు క్రీ.శ. 1582లో కాలకంఠేశ్వరాలయం కట్టించినట్లుగా
536
వావిలాల సోమయాజులు సాహిత్యం-4