ముగ్గురు కుమాళ్ళూ, మరకతవల్లి, మంగళాంబ అనే ఇద్దరు కూతుళ్లూ ఉన్నారని తెలిసింది. అనే కవి గ్రహించాడు. ఆ వ్యాసాన్ని చూడకపూర్వం మంగళాంబకు సర్వమంగళ, అనే పేరు పెడదామనుకున్నారట! ఆశ్చర్యము! ఆమె అసలు పేరుకూ కవిభావిత నామధేయానికి ఎంత సామీప్యము! దీక్షితుల భార్య పేరు కూడా మంగళాంబే. తికమక తొలగించడానికి అప్రధానమనీ ఆమెను ప్రవేశ పెట్టలేదు. కాల నియమాన్ని అనుసరించి ఉమామహేశ్వర, నీలకంఠ, చంద్రావతంసులు రంగం మీదకి రావటానికి వీలులేక పోయింది. పద్య నాటికలో పాత్రల సంఖ్య పరిమితంగా ఉంటే పసందు. కథానాయకాభిధానము కల్పితము. శైవ సంప్రదాయ యోగ్యంగా ఉండటానికి 'చంద్రమౌళి' అనిపించుకున్నాడు.
5
ఆరామంలో సాయంకాలము వేదిక మీద కూర్చొని పసుపుపచ్చని తాళపత్రం మీద ఘంటంతో చంద్రమౌళి వ్రాస్తుంటాడు. ఇంతలో మంగళాంబ మంద గమనంతో వచ్చి కొంచెం సేపు వెనక నిలుచొని వ్రాసేదేమిటని ప్రశ్నిస్తుంది. శివార్కమణి దీపికా ప్రతి చూడటానికి వీలు లేదంటాడు. ముద్దుగా మొండికి వేసి హావభావాలు చూపి తాళ పత్రం తీసుకొని అందులో ప్రణయగీతాలు, చదువుతుంది. తరువాత తనమీదనే అని తెలుసుకోవటంతోటే ఆమెలో అదివరకే నాటుకొన్న ప్రణయ భావాంకురం మొలకెత్తుతుంది. అతన్ని క్రీగంటితో చూచి అవనతవదన ఔతుంది. చంద్రమౌళి చేయి పట్టుకొని తన హృదయాన్ని విప్పి చెపుతాడు. అన్యోన్య అనురాగం వ్యక్తం చేసుకుంటారు. వివాహం చేసుకుందామనుకుంటారు, ఆమెను సందిట చేర్చుకొని అతడు శిరస్సు మూర్కొనే సమయంలో లతాగుల్మాలు కదులుతవి. చంద్రమౌళి లేచిపోతాడు. అక్కడికి వచ్చి తెలుసుకోవటం వల్ల సరసవాణికి సర్వం తెలిసిపోతుంది. మంగళాంబ వివాహానికి మరకతవల్లీ, సరసవాణీ తోడ్పడతామన్నారు. ఇది ప్రథమరంగం.
వెన్నెల రాత్రి వితర్దిక మీద కూర్చొని మరదలు సరసవాణి తమలపాకులకు సున్నము రాసి ఇస్తుంటే దీక్షితులు తాంబూలం వేసుకుంటుంటాడు. సంభాషణ కొంత దూరం సాగిన తర్వాత లోపల నుంచి మంగళాంబ పాట వినిపిస్తుంది. దీక్షితులు ఆమె కంఠం ఒదుగైనదనీ, చదువు చెప్పిస్తే సంగీతము అబ్బేదనీ అన్నాడు. సరసవాణి ఆమె వైధవ్యానికి చింతించి, పునర్వివాహము శాస్త్ర సమ్మతమేనా అని ప్రశ్నించింది. ఆయన ఔనన్నాడు. అయితే మంగళకు ఎందుకు చేయకూడదన్నది. పెళ్ళి ఒకవేళ
సాహిత్య విమర్శ
535