Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/532

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దీక్షిత దుహిత

1

పాండితీ ప్రతిభలకు చుక్కెదురు. ఒకటి ఉన్నచోట ఇంకొకటి ఉండదు. కానీ అరుదుగా అవి రెండూ కలిసిన కవులున్నారు.

అధునాతన ఆంధ్రసాహితీ ప్రపంచంలో వ్యుత్పన్నత, ఉపజ్ఞ - రెంటినీ పొడిగించుకున్న కవులు కడుంగడు దుర్లభులు. నూతన రచనాసంప్రదాయాలకు మార్గదర్శకులై 'నవ్యసాహిత్యాచార్య' పదవిని అధిష్ఠించిన శ్రీ శివశంకరశాస్త్రిగారు వీరిలో ఒకరు. పట్టినదెల్లా బంగారం చేసి శిల్ప ప్రపంచంలో సిద్ధహస్తులనిపించు కున్నారు. వీరిలేఖిని లీలావిహారం చెయ్యని కావ్య విభాగం (Poetic form) కనపడదు. రచనలన్నిటిలో రూపక విధానానికి (Dramatic Instinct) ప్రాపు అధికము. ఖండ కావ్యాలలో గానీ, ఉపకావ్యాలలో గానీ, ఇతర గీతాలలో గానీ, నటనోచిత రూపము. నవనవోన్మేషతతో నాట్యం చేస్తుంది. దృశ్యశ్రవ్యానుయోగ్య పద్య, గీతి నాటికారచనము వీరిలో ఉన్న విశిష్టత - ఉపజ్ఞ. ఇది వీరికొక ప్రధానోత్సాహము.

2

చాలాకాలం వరకూ సంస్కృత నాటకప్రీతి తరువాత పాశ్చాత్య నాటకాలంటే అత్యంత ఆదరము వీరికి అవతరించింది. ప్రపంచ పద్య, గీతినాటికా కర్తల్లో ప్రముఖులు Goethe, Browning, Wagner, Keats, Tagore ఇత్యాదులు గ్రంథపరంపర సాంగంగా చదవటం వల్ల, ఆంధ్రభాషలో అంతకు పూర్వం లేని అపూర్వ పద్యనాటికారచనం మీద అభిమానం అంకురించింది.

ఆంగ్ల సారస్వతంలో క్రీశ. 1915 నుంచీ పదేండ్లపాటు పద్యనాటిక వెనుకంజ వేసింది. Bax, Bessier, Bottomley, Phillips Eliot, Auden, Spender ప్రభృతులు ఈ సాహిత్యశాఖకు నూతన జీవము ప్రసాదించారు. వీరి, రచనలవల్ల శ్రీ శాస్త్రిగారికి పద్యనాటికారచనకు ఉత్సాహం కలిగింది. కానీ, పై రచయితల ప్రోద్బలము కావ్యాలమీద కనిపించదు - లేదు.


532

వావిలాల సోమయాజులు సాహిత్యం-4