భాషలో వుంటే అటువంటి సందేహం ఎందుకు పుట్టిందనుకోవచ్చు. కొంతమంది కావ్యాలలో వచనాన్నీ వచన కావ్యాలలోని వచనాన్నీ మిళావు చేసి కృతక భాష తయారు చెయ్యటం వల్ల వచ్చింది. ఆ సమస్య వచ్చినప్పుడు వాళ్లు చేసుకున్న నియమం ఏ విధంగా కనిపిస్తుందంటే ఎవరైనా ఛాందస బ్రాహ్మణుడుంటే ఆయన కూడా తాను మాట్లాడేటట్లే వ్రాయాలని అనుకున్నట్లుగా తోస్తుంది. ఉదాహరణం చూపిస్తాను. మృగయాత్రను వివరిస్తూ ఒక ఛాందసుడు :
"ఆ మృగయాత్ర లక్షణం యెషువంట్టిదంటేను విళ్ళుధరించ్చిన వాల్లు= కొందరున్నూ కత్తులను ధరించ్చినవాళ్లు కొందరున్నూ యుద్ధముఖ్యులైన వీరభటులు కొందరున్నూ యీ ప్రకారమైనఘువంటి మహాపరిజనం కలవాడౌ కుంచున్నూ మరింన్ని గీతావాద్యములతో కూడుకుంన్నవాడౌకుంచున్నూ మరింన్ని విల్లు బాణచక్ర అసిగదాకుంత్త యివి మొదలుగా గలఘువంట్టి ఆయుధాల చాతనున్నూ” అని యీ విధంగా వర్ణించాడు.
క్రీ.శ. 1850 తరవాత బాగా ఆంగ్లవాఙ్మయ ప్రోద్బలం మన భాషమీదికి వచ్చింది. క్రీ.శ. 1852లో చిన్నయసూరి నీతిచంద్రిక వచన కావ్యంగా రచించాడు. క్రీ.శ. 1853లో మొదటి కూర్పు సూరి జీవించి వుండగానే ముద్రితం అయింది. ఆ గ్రంథానికీ మనకు ప్రస్తుతం ఉపలబ్ధమయ్యే గ్రంథానికీ చాలా వ్యత్యాసం వుంది.
కృత్రిమ భాషాప్రాభవం మిగతా పండితులందరికీ అబ్బింది.
ఆ మార్గానుసారులే ముద్రణయంత్రాలయాలలో పరిష్కర్తలుగా ఉండడం వల్ల టీకా గ్రంథాలూ, కావ్యాలలో వున్న వాడుక భాషలోని ప్రయోగాలు మార్చి గ్రంథ ముద్రణం చేశారు. చిన్నయసూరి ఏర్పరచిన కృత్రిమ సంప్రదాయమే కొంత కాలం వచనరచనకు మార్గమయింది. వీరేశలింగం పంతులు అక్కడక్కడ విసంధి గాను కొద్ది వ్యావహారిక భాషాప్రయోగాలతోను సంధి విగ్రహాలు వ్రాసినాడు. ఈ పందొమ్మిదో శతాబ్ది చివర భాగంలో పత్రికానిర్వహణం వాఙ్మయానికి గొప్ప దోహదం ఇచ్చింది. కల్పలత పత్రికకు పూర్వమే శ్రీయక్షిణి, తత్త్వ బోధిని, వర్తమానతరంగిణి, సుజనరంజని, గోదావరి, విద్యాప్రబోధిని, ఆంధ్రభాషా సంజీవిని, పురుషార్థ ప్రదాయిని, దీనవర్తమాని, వ్యవహార తరంగిణి, హితవాది, సుధీరంజని, స్వధర్మ ప్రకాశిక, సకల విద్యాప్రబోధిని, బ్రహ్మాండరంజని, లోకరంజని, వివేకవర్ధని, జనవినోదిని, స్వదేశిని, మందారమంజరి, ప్రబంధ కల్పవల్లి, ఆంధ్రప్రకాశిక, రాజయోగి, కళానిధి, హాస్యవర్ధని, సత్యసంవర్ధని, చింతామణి, ధీరంజని మొదలైన పత్రికలన్నీ వచనరచనకు తోడ్పడ్డాయి. ఈ
530
వావిలాల సోమయాజులు సాహిత్యం-4