"కాకరచెట్టులో బూచి వున్నదని సోయింత రాజుతో గాంధారి చెపుతూ వున్నది. వాడు కొట్టుతానని కత్తి తీసుకొని చక్కా వస్తాడు. అవతలా ఇవతలా చూస్తాడు. ఎక్కడ చూచినా ఏమీ లేకపోతుంది. ఆ కోపం చేత బాకు బండకు వేసి పొడుస్తాడు. ఫెళ్ళున విరిగిపోతుంది. అది విరిగిపోంగానే అట్టే గోతిలో నుంచి దిగ్గున లేచి పోయి సోయింత రాజును పట్టుకొని ఆ గోతిలో పడవేసి పైన యీ బండవేసి అట్టే అణగద్రొక్కి పోదామని ఉపాయం చేసుకున్నాడు సుందరగిరిరాజు. గాంధారి చూచి పాడుతుంది ఎటువలెను పదం :
అధినాధుడా రావె తుమ్మెదా
అల్లతడు వూరికిపోయె తుమ్మెదా
నావద్ద యెవరూ లేరు తుమ్మెదా
వచ్చి వాలాలాడిపో తుమ్మెదా
చెట్టువేసీ పాయె తుమ్మెదా
వో కావిలెవ్వరు లేరు తుమ్మెదా
రాతికిందా వున్న తుమ్మెదా
నీనెత్తి బర్వుదింపె తుమ్మెదా
బాసలిచ్చినాను తుమ్మెదా
బలిపీఠగొట్యాను తుమ్మెదా”
అని పాడుతుంది. ఎంతో అందంగా వచనంలో వున్న ఆ నాటి కథావాఙ్మయం అంతా ఎంతో ఉత్సాహవంతంగా వుంటుంది. ఇటువంటి వాఙ్మయం నిరాదరణం వల్ల చాలా నశించింది. క్రీ.శ. 1800 మొదలు 1850 లోపుగా జరిగిన శాస్త్రరచన నాట్య శాస్త్రము, వైద్యము, కామకళ అన్నీ కూడా వ్యావహారిక భాషలోనే రచించారు. అల్లూరి పురుషోత్తమ కవి రచించిన కామశాస్త్రంలోనుంచీ ఆ నాటి శాస్త్రరచనావైఖరికి ఉదాహరణం చూపిస్తాను: “పద్మిని కుందనపు బంగారువలె గాని నల్లకలువల వలెగాని కాంతి కలిగి తామరపద్మములవంటి సువాసన గల శరీరము నెమిలి పింఛము వంటి నల్లనిజుత్తూ చంద్రునివంటి ముఖము కలవలవంటి కళ్ళూ సంపెంగ రేకులవంటి ముక్కూ మదపుటేనుగవంటి నడకయున్నూ
ఈ కవికన్నా ఇతర శాస్త్రకవుల జ్యోతిషం ముఖ్యంగా జీవద్భాషలో వుంటుంది. ఈ కాలములోనే వచనం ఏ విధంగా వ్రాయాలనే సందిగ్ధత వచ్చి, మాట్లాడే భాషలో వ్రాయటం మంచిదని వాళ్ళు అనుకున్నట్లున్నారు. అసలు పూర్వంనుంచీ వ్యవహార
సాహిత్య విమర్శ
529