వెంకటసుబ్బయ్య కవికూడా రామాయణ వచన కావ్యం రచించాడు. పులిపాక రామన్న వచన రామాయణం, శ్రీరంగమాహాత్మ్యమూ, ఇంత కంటే చాలా పూర్వంవి. ఈ కాలంలోనే శ్రీపతి రామభద్రకవి తెలుగు వచనకావ్యంగా స్కాంద పురాణాంతర్గత హాలాస్యమాహాత్మ్యాన్ని కూర్చాడు. చొక్కనాథుని దళవాయి, తుపాకుల అనంత భూపాలుడు తెలుగువచనంగా రామాయణాన్ని, భారతాన్ని, భాగవతాన్ని, విష్ణుపురాణాన్ని కృతులుగా చేశాడు. పుష్పగిరి తిమ్మన వచనభాగవతం తెలుగు వచన కావ్యంగా కూర్చింది ఈ కాలంలోనే. తంజావూరు మహారాష్ట్ర నాయకుల కాలంలో పేరుపొందిన 'అభినవ కాళిదాసు' ఆలూరి కుప్పన వచన రచనలు చాలా చేశానన్నాడు. మైసూరు చిక్క దేవరాయలు (క్రీ.శ. 1672-1704) దళవాయి కళువె వీరరాజు, అతని కుమారుడు నంజరాజు తెలుగులో వచన నిర్మాతలు. వీరరాజు క్రీ.శ. 1680లో తన భారతాన్ని పూర్తి చేసినాడు. నంజరాజు వచనంగా కూర్చిన విష్ణుభక్తవిలాసము, కాశీ మహిమదర్పణము, గరళ పురీమాహాత్మ్యము, పేరు పొందినవే. వెంకటగిరి ప్రభువు వెలుగోటి యాచమ నాయకుడు వేదాంతగ్రంథాలు అనేకం వ్యావహారికభాషలో రచించాడు. గోపీనాథకవి ఓడ్రభాషలో నుంచి రామాయణాన్ని తెలుగులో వచనంగా వ్రాసినాడు. 17, 18 శతాబ్దులలోని భాషకు ఉదాహరణంగా కొన్ని వచన భాగములు:
“తదనంతరంబ్బ వషిష్ట మహామునీంద్రుండ్డు దిలీప మహారాజునుంజూచి, మృగశృంగమహామునీంద్రుండ్డు సలక్షణంబుగా అఖిల వేదంబులం జ్జదివించ్చి బృంమచర్యవ్రతంబ్బు నెరవేర్చి”
విజయరంగని మాఘమాహాత్మ్యము
"చతుర్ముఖుండు ఆ దేవదేవునుద్దేశించి స్వామీ నీవు నాయందు ప్రసన్నుండవగుట నిక్కంబేని నీ నిజరూపంబు నేటివరలో ఒక్క నాడేనియు దివ్యకల్యాణ విగ్రహంబు గొనశాయవైతివి”
శ్రీరంగ మాహాత్మ్యము
ఈ రెండు శతాబ్దులలోని వచన రచనావిధానం వింతగానే వుంటుంది. ద్రుత ప్రకృతిక సంధి, కావలసిన చోట చేసేవారు; లేనిచోట లేదు. విసంధిగా వ్రాసేవారు. యడాగమము గిట్టదు. ప్రథమా విభక్తి ప్రత్యయాలను తపంబ్బు, మనస్సు, కొండెంబ్బులలో మాదిరిగా ద్విత్వమొనర్చడం ఉంది. ఉత్తుకు అచ్చుపరమైతే సంధి చేస్తే చేసేవాళ్ళు; లేకపోతే వ్యవహారం దొర్లినట్లుగా వ్రాసేవారు. పదాలమీద ఊత
526
వావిలాల సోమయాజులు సాహిత్యం-4