కవిని పోషించాడు. నృసింహ పురాణంలో ఈ చెన్నశౌరి ఆంధ్రభాషలో వచనకావ్యంగా బాలభారతం రచించాడని "బాలభారత మంధ్రభాషను రచించె కవీశ్వరులు మెచ్చ” అనే పాదం వల్ల తెలుస్తూ వున్నది. ప్రబంధయుగానికి పూర్వమే ఎన్నో కావ్యాలు ఆంధ్రభాషలో రచితమై నశించాయి అన్నమాట. కృష్ణరాయలు రాజ్యానికి వచ్చాడు. కవుల దృష్టి మళ్లా పద్య కావ్య రచనమీదికి పోయింది. కొంతకాలం క్రీ.శ. 1559లో విశ్వనాథ నాయకుడు మధురలో స్వతంత్ర పరిపాలనం సాగించినాడు. అతని సేనాపతి 'రాయవాచకం' వచనంగా రచించినాడు. ఈ వచన గ్రంథమే కుమార ధూర్జటి కృష్ణరాయ విజయానికి మాతృక అంటారు. ఇందులో వచనం వ్యావహారిక భాషలోనే వుంటుంది. చూడండి . "పట్టణములో గల అష్టాదశ వర్ణాలవారును అత్యంత సంతోష పరులై అతి వైభవములతోడట్లు నిత్యకల్యాణములున్ను పచ్చతోరణములున్నూ కలిగి యున్నారని విన్నపం శాయంగా దళ నాయకులు విని రాయలవారికి విన్నపం చేశారు. ఆ పిమ్మట విఠల విరూపాక్షస్వామి ధ్వజారోహణమై వున్నది. రథోత్సవమునకు విజయం శాయవలెను; అని విన్నపం శాయంగ దగ్గిర వున్న దళనాయకులు ఆ తీరున్నే రాయలవారు విచ్చేసివున్నారు” ఈ విధంగా వాక్యావసానం లేకుండా ఉంటుంది. పదిహేడు పద్దెనిమిది శతాబ్దులలో దక్షిణ దేశంలో వచనరచన విరివిగా జరిగింది. ఈ రెండు శతాబ్దుల కాలంలోనూ వచనరచన అంతా వ్యావహారిక భాషలోనే నడిచింది. వచన సాహిత్యాన్ని పోషించిన వాళ్ళలో ముఖ్యులు మధుర నాయకులు. మధుర చొక్క నాథుడు (క్రీ.శ. 1660-1682) తిరుకామకవిని పోషించాడు. అతను శృంగార సత్యభామా సాంత్వనము, రుక్మిణీ పరిణయము, అనే పద్య కావ్యాలు రచించాడు. ఆ కనే ధేనుకామాహాత్మ్యమనే వచన కావ్యాన్ని తేటమాటల్లో రచించాడు. మధుర నాయక రాజ్యాన్ని పరిపాలించిన విజయరంగ చొక్కనాథుడు (క్రీ.శ. 1704-31) మాఘమాహాత్మ్యమూ, శ్రీరంగ మాహాత్మ్యమూ అనే రెండు వచన కావ్యాలు కూర్చాడు. ఇతని సేనానాయకుడే సముఖము వేంకట కృష్ణప్ప నాయకుడు. ఇతడు 1710 ప్రాంతంలో జైమిని భారతము, సారంగధర చరిత్రము అనే రెండు వచన కావ్యాలు రచించాడు. విజయరంగని ఆస్థానంలో వెలగపూడి కృష్ణయ్య కవి వుండేవాడు. అతడు తన భానుమద్విజయ కావ్యంలో "సన్నుత వేదాంత సార సంగ్రహ శాస్త్ర మమరంగ వచన కావ్యంబొనర్చి" అనే పాదంలో వేదాంత సంగ్రహము వచనంలో రచించినట్లు చెప్పినాడు. ఈ రాజన్యుని కాలంలోనే శ్యామారాయకవి యథావాల్మీకి రామాయణము వచనంగా కృతి చేశాడు. ఇతడు విద్వత్కవి. సంస్కృతాంధ్ర భాషా కవితా నిర్వాహకుడు. ఈ వచన రామాయణాన్ని నవరసాలంకారంగా తెనిగించాడు. ఈ కవి మిత్రుడు
సాహిత్య విమర్శ
525