తిక్కన వచనం దేశీయ పదాలతో కొద్ది సంస్కృతం మేళవించి వ్రాశాడు. ఉదాహరణం.
“ఏము కలహం బొల్లక పొందుగోరుట తనకు మేలు. తన మనంబున దరికొను తృష్ణానలం బార్ప నొరు లడ్డంబు సొరమింజేసి యేన బుద్ధి సెప్పవలసి వచ్చె. తన యొద్దం గల యోధవరు లెయ్యెడల లేమిం దెల్లంబయినను మాకుఁ జేదోడు ధర్మంబుగల దదియునుంగాక యఖిలలోక సేవితుండైన శ్రీకృష్ణుండు పెనుబ్రావుగావున మమ్ము ...” నన్నయ కొద్దిగా వెనుక పుట్టినా ప్రత్యేక వచన కావ్యాలు రెండు శతాబ్దులవి దొరకడం లేదు. ఇందుకు పద్య కావ్యాలమీద వున్న ప్రేమ గద్య కావ్యాలమీద మొదటి కవులకు లేకపోవటమూ, వీరశైవులు మొదలుపెట్టిన, వచనరచన మతవైషమ్యాల వల్ల రూపుమాసేటట్లు కూడా చేసి వుండడం బహుశః కారణాలు అయి వుంటాయి. ప్రస్తుతము దొరికే ప్రాచీన ప్రత్యేక వచనరచనలో మొదటిది ప్రతాపరుద్ర చరిత్ర. కృతికర్త ఏకామ్రనాథుడు. ఈ కవి కాకతీయ ప్రతాపుని ఆస్థానకవి అని స్థానిక చరిత్రలను బట్టి తెలుస్తూ వుంది. ఈ వచన గ్రంథంలో చంపూ కావ్యాలలోని వచనానికి మాదిరిగానే కావ్యావసానం ఉండదు. వ్యావహారిక భాషాప్రయోగాలూ, వ్యాకరణవిరుద్ధ భాష వాడుతాడు. ఉదాహరణం : "ఇక్కడ ఏకశిలానగరంబునున్న పాఠశి రాజు మృతిబొందిన అతని తమ్ముడు జవానుములుకు ఫకీరు వేషంబున ఏకశిలానగరం బునజొచ్చి పురంబు అంత తన సాధ్యంబుగాకుండ జేసి తన అన్న సతీ సుతులకున్నూ తాను యెరుక సేసి వారిని ఫకీరు వేషంబున పురంబు వెడలదీసుకొని తన రాజ్యంబునకు వచ్చి వాండ్లనునిచి” ఈ వచన భాగంలో వ్యావహారిక ప్రయోగాలు విరివిగానే వున్నాయి. గ్రంథం అంతా వ్యావహారిక భాషలోనే వ్రాస్తే కారణాంతరాలవల్ల కృతకభాషగా మారిపోయినట్లు కూడా కనిపిస్తుంది. తరువాత శ్రీనాథకవి సమకాలికుడు, తాళ్ళపాక అన్నమాచార్యులు, సంకీర్తనలక్షణం వచనంగా వ్రాస్తే దానిని అతని మనమడు ద్విపదగా చేశాడట. రాయవాచకంలో వీర నృసింహరాయల దినచర్యను గురించి వ్రాస్తూ స్థానాపతి, "విద్యానగరమందు వీరనృసింహరాయల వారు బ్రాహ్మీముహూర్తాన లేచి ఆరాధ్యులు నామావళులున్నూ, ఆధ్యాత్మ సంకీర్తనములున్నూ, పాండవగీతలు, భ్రమరగీతలు, గజేంద్ర మోక్షము, భారతసావిత్రి, దధినామనస్తోత్రము... ఇవన్నీ, మొదలైన నీతివైరాగ్య శతకం పురాణ శ్రవణమున్నూ” ఈ విధంగా వ్రాశాడు. ఇందులో భారతసావిత్రి తెలుగు వచన కావ్యం. ఈ కావ్యాన్ని ఎల్లకర నృసింహకవి తాను వ్రాశానని మార్కండేయ పురాణంలోని "ప్రచురవాక్యములచే రచించితివి కవిరాజు లౌననంగ" అనే పాదంలో చెప్పుకున్నాడు. ఆ వీర నృసింహరాయలు చెన్నశౌరి అనే
524
వావిలాల సోమయాజులు సాహిత్యం-4