పదో శతాబ్దానికి వస్తే తెలుగువచనం కేలం గ్రామ చిహ్నాలు తెలియ జేయటానికి విరివిగా ఉపయోగించారు. కేవలం వచనంలో వున్న శాసనాలు ధర్మవర శాసనంలోని వచనాన్నే అనుసరించి వుంటవి.
ఈ అజ్ఞాత యుగంలో వున్న ప్రత్యేకత ఉచ్ఛారణానుసరణంగా వ్రాయటం ముఖ్యమైంది. 'పృథివి' శబ్దము 'ప్రిదివి' అని వుచ్చరించేవాళ్లు కాబట్టి ఆ విధంగానే వ్రాశారు. ప్రథమావిభక్తి ప్రత్యయాలు హలంతాలు గానే వున్నాయి. ధర్మ, పూర్ణిమ, దుర్గ పదములు దమ్మ, పేణ్ణ, దుగ్గ, అని వికృతులుగా వ్రాయబడ్డాయి. ణ, న, స, శ, ష; ల, ళ లకు అభేదం కనిపిస్తుంది. విసంధిగా వ్రాయటము ప్రథమ తరువాత గ, స, డ, ద వా దేశ నిత్యత, కనిపిస్తవి.
అహదనకర శాసనంలోని “ఊరుదాయ సేసియిచ్చి” అనే వాక్యంలో అసమాపకక్రియ సమాపకక్రియగానే ఉపయోగించారు. ఈ ఆచారం మలయాళ భాషలో ఇంకావుంది. ప్రథమావిభక్తి ప్రత్యయాల్లో 'లు' కు బదులు 'ళ్' (సంవత్సరంబుళ్, ఊరిస్వాముళ్, భటారళ్, కొన్డుకళ్ మొదలైన పదాలలో) కారము 'ము' వర్ణానికి బదులుగా పూర్ణానుస్వారం లేకుండా వున్న 'బు' (పట్టనబు, దశపరాధబు) కనిపిస్తవి. ఆ యుగంలోని వచనంలో ప్రస్తుతం మనము అర్ధానుస్వారము పూర్ణానుస్వారము ఉపయోగించే చోట అనునాసికాక్షరం ప్రయోగించటం కనిపిస్తుంది. సాక్షులు అని వ్రాయటానికి 'సాక్షిమంతు' లని, కాశ్యప గోత్రుడైన రేవణశర్మ అని చెప్పటానికి రేవణశర్మ కాశ్యప గోత్రజుడనీ వ్రాయటం కనిపిస్తుంది, అన్నేంటి (అను+ఏడు+స్ట్) మొదలైన విశిష్ట ప్రయోగాలు కనిపిస్తాయి. 'పొలము' అనే పదానికి 'పులొంబు' అనేది ప్రాచీన రూపంగా కనిపిస్తుంది. అంటే ఆ పదం తరువాత వర్ణవ్యత్యయాన్ని (Metathesis) పొందుతుందన్నమాట. ఈ యుగంలో వచనరచనలోనూ, పద్యరచనలోనూ ఒక వింత అక్షరం కనిపిస్తుంది. అది (అ లేక ), చోఱ, మాఱ, ఱు మినకంపునకు, అచ్చువాను మొదలైన శబ్దాలలో ఈ అక్షరం కనిపిస్తుంది. ఇది తరువాత 'ళ' కారంగాను, 'డ' కారంగాను మారుతుంది. దీని ఉచ్చారణము ఫ్రెంచి భాషలోని KJ వర్ణోచ్చారణాన్ని అనుసరించి వుంటుంది. గుణగ విజయాదిత్యుని ధర్మవరం శాసనంలోని భాష, వచన సంప్రదాయము నన్నయనాటికి కొద్దిమార్పు పొందినవి.
మన దేశంలో అనాది కాలంనుంచీ శాసనాలు గద్యపద్యాత్మకంగా వ్రాయటం అలవాటు. అంతేకాకుండా సంస్కృతంలో త్రివిక్రమభట్టు ఎనిమిదో శతాబ్దిలోనే దమయంతీ కథను చంపువుగా వ్రాశాడు. ఈ చంపూమార్గాన్ని అనుసరించే నన్నయభట్టు
522
వావిలాల సోమయాజులు సాహిత్యం-4