ఈ పుటను అచ్చుదిద్దలేదు
చరణ చారణచక్రవర్తి నాటకరంగంలో ప్రయోగాన్ని పొంది పేరుగన్నది. దీక్షిత దుహిత మహోదాత్త పద్యనాటిక అని ప్రఖ్యాతంగా అంగీకరింపబడ్డది. వరపరీక్ష, కవిప్రియ ఇత్యాదులైన గేయనాటికలు గానీ, యక్షరాత్రి అనే గేయసల్లాపము కానీ తమలో ఏ ఒక్క రూపలక్షణాలను పోలని ప్రత్యేక లక్షణాలతో రమ్యంగానూ, రసవంతంగానూ రూపొందిన మహానాటికలు. రూపకళావిజ్ఞానశేఖరులైన శ్రీ శివశంకరస్వామి నాటికలను, నాటక సంస్థలు, టి.వి. రసజ్ఞులు, ప్రదర్శించి ఆంధ్రజాతికి ఘనతర రసానందాన్ని ప్రసాదింపవలసిన అవసరము ఎంతైనా ఉన్నది.
బహువిధ నవ్యసాహిత్య సృష్టికీ, వ్యాప్తికీ - కారణజన్ములుగా అవతరించి తమ మహాపాత్రను శేముషీమహత్త్వంతోనూ, మనోజ్ఞతతోనూ, నిర్వర్తించి, కార్యనిర్వహణా నంతరం శ్రీ శివశంకరులు 1-4-1977న సిద్ధిపొంది, బ్రహ్మీభూతులైనారు.
- తెలుగు వైతాళికులు, సంపుటం 4
సాహిత్య విమర్శ
519