వ్రతభంగము (1942), కావ్యావళి (1924-50). వీరి పద్య, గేయ కావ్యాలు, పద్మావతీ చరణ చారణ చక్రవర్తీ, వరపరీక్ష, యక్షరాత్రి, సహజయాన పంథీ, దీక్షిత దుహిత, కవిప్రియ, పదాంకము, సద్వాక్యము, రాజజామాత, నోణకభార్య వీరి పద్య, గేయనాటికలు. 1934 నుంచి వీరు దృష్టిని విశేషంగా గేయకవిత్వ ధోరణికి మరలించారు. పద్య గేయ సంవాదాత్మక రచనలలోనూ, పద్య, గేయ నాటికలలో కథావస్తు రూపక నిర్వహణ (Plot construction) ల్లోనూ, పాత్రచిత్రణలోనూ, భావ వ్యక్తీకరణలోనూ అనంత వైవిధ్యాన్ని ప్రకటించిన వీరు అద్వితీయులు. ప్రేమ, భక్తి, మధురభక్తి, ధర్మవీరము వీరి రచనలలోని ప్రధానరసాలు. వీరు సర్వత్ర స్త్రీకి విశేషోత్కర్ష ప్రకటించారు.
శ్రీ శివశంకరుల పద్య, గేయ రచనలలో కొన్ని ఆత్మ పరకావ్యాలు (Subjective Poems), కొన్ని అన్య పరకావ్యాలు (Objective Poems), కొన్ని కథాకావ్యాలు (Narrative Poems), కొన్ని వాకోవాక్యములు, కొన్ని నాటకీయ సంవాదాలు. కొన్ని నాటకీయ స్వగతాలు (Dramatic Monologues), ఇతర రచనలు : పద్య నాటికలు, పద్యగేయ నాటికలు, గేయ నాటికలు.
శ్రీ శివశంకరులు కొన్ని కథాకావ్య వస్తువులు, ఇతర కావ్య వస్తువులు భారతదేశంలోని బహుప్రదేశాలకు సంబంధించినవి కావటం వల్ల, బహు గ్రంథ పరిచయం వల్ల, పరిశోధనలవల్ల, సంపాదించారు. వీరు తమ ఉభయవిధ రచనలలో లోపాముద్ర, రేణుక, రుచి అన్న పౌరాణిక స్త్రీ పాత్రలను; జమదగ్ని, దేవశర్మ, ధనుర్దాసు, కక్కయ్య అనే పౌరాణిక పురుష పాత్రలను; చామెకాంబ, భామతి, మీరాబాయి, ప్రతాపకుమారి, అలకాదేవి, నింబవతి, రామమణి, యామినీదేవి, నీలలోచన, మొదలైన చారిత్రక స్త్రీ పాత్రలను; వాచస్పతి, రూపగోస్వామి, రామనాథ భట్టాచార్యుడు, జయదేవుడు, జ్యోతిస్సింగు, నేమి, చండీదాసు, అప్పయ్య దీక్షితులు, బిల్హణభట్టు, లలితాదిత్యుడు మొదలయిన చారిత్రక పురుష పాత్రలను అపూర్వశక్తితో సృష్టించి ప్రదర్శించారు. వీరి సజీవ పాత్రల మూలంగా వీరు ప్రణయ, భక్తి, ధర్మాది విషయాలలో మానవమనఃప్రవృత్తి ఎంత వైవిధ్యంతో వర్తిస్తుందో మనోహరంగా వాస్తవికతా (Realism) రీతిలో వెల్లడిచేశారు.
శ్రీ శివశంకరుల పద్యగేయరచనలలోని కావ్యాలన్నిట్లో, ప్రధానంగా కావ్యావళిలోని కృతులు ఎన్నో హృదయాకర్షకాలు. హృదయేశ్వరీ వకుళ మాలికలు సాహిత్యలోకంలో ప్రత్యేక విఖ్యాతి గన్న రచనలు. పద్యనాటిక అయిన పద్మావతీ
518
వావిలాల సోమయాజులు సాహిత్యం-4