ప్రజ్ఞావిలసితము. మహాపండితులైనా వీరు కవితలో ఎక్కడా పాండిత్య ప్రకర్షను ప్రదర్శించలేదు. "శ్రీ శివశంకరశాస్త్రిగారు వాక్శుద్ధి గల కవివరేణ్యులు; వారి రచనలన్నీ భావోదాత్తములు. వారి పద్యమయ నాటికలు హృద్యరసనాటికలు. రచన ఎంత చిన్నదైతే ఏమి? దానిలో ప్రజ్ఞ మెరపుతీగలాగు మెరపడంలో ఉంది మహిమ. శ్రీ శివశంకర శాస్త్రిగారి 'చిత్తకుబ్జ' రచన (ఆవేదనలోని ముత్యాలసరం షట్పదీ ఛందం 9 పంక్తులు నడిచిన ఖండకావ్యము) చదివినప్పుడల్లా నాకు పారవశ్యం కల్గుతుం దని స్వామివారి కవితను శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి మహాశయులు ప్రశంసించారు.
“వీరి 'హృదయేశ్వరి' ఆత్మపరమైన కావ్యాల సంపుటి, తీవ్రానుభవాలలో వేగిపోయే హృదయం వాటిలో వేడివేడిగా ఎంతైనా కనబడుతుంది. వీరి అనువాదాలు క్రొత్తవి కావ్యరూపాలు క్రొత్తవి. వీరు కల్పించే చిత్రాలూ, అలంకారాలూ, పాత సంప్రదాయానికి దగ్గరగా ఉన్నట్లనిపిస్తాయి; వీరి భాష మీద కూడా సంస్కృతప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది; వీరి పద్యం నిదానంగా, గంభీరంగా నడుస్తుంది - ఎక్కువ వేగమూ, ఆవేశమూ, 'పెద్ద మనిషి తరహా' కాదన్నట్లు. వీరి దివ్యలోచనములు వంటివి (కావ్యాళి' లోని ఒక సంవాదాత్మక రచన) మహామంచి కావ్యాలు... వీరు పద్య రూపకాలు వ్రాయడంలో మార్గదర్శి" అని శ్రీ దేవులపల్లి కొన్ని శివశంకర కృతులను గురించి అభిప్రాయాన్ని వెల్లడించారు. శ్రీ శివశంకరులు 'మేడూరి వారి కోడలు' అనే కథాకావ్యాన్ని జూన్ 1933 భారతిలో ప్రకటించినప్పుడు శ్రీ కృష్ణశాస్త్రి "ఈ మధ్య భారతిని అసలు చూడటమే లేదు నేను. నిన్న చూచాను ఈ నెలది. 'మేడూరివారి కోడలు' ఒకటే చదివాను. ఈ వేళ మళ్ళీ చదివి ఈ ఉత్తరం వ్రాసిందాకా తోచక ఇపుడే వ్రాసి పోస్టు చేస్తున్నాను. మన తెలుగులో పద్యాలలో ఇంతకంటే బాగుగా రచింపబడ్డ చిన్న కథ మరొకటి లేదు. 'ఉంది' అనే అభాజనుణ్ణి ఏం చేస్తానో తెలియదు. దీని ముందర 'టెనిజన్' 'డోరా' గిర్రుమని తిరిగి చచ్చి ఊరకుంది. వెర్రిమొర్రి పొగడ్త కాదు.... దీనిలో ఒక మాటగానీ, ఒక పాదం గానీ తీసివేయలేను. గౌరవము పోకుండా Lucidity వచ్చింది. అవసరమైనచోట్ల Poetic Heights వచ్చాయి... మొదటి పద్యం హృదయం పట్టుకుంటుంది. అపుడే వల్లిస్తున్నాను” ఇత్యాదిగా హృదయపూర్వక లేఖ వ్రాసి విమర్శించారు.
శ్రీ శివశంకరశాస్త్రి రచనలలో పద్య, గేయ కావ్యాలు - పద్య, గేయ నాటికలు అన్న రెండు ప్రధాన విభేదాలు ఉన్నవి. అవేదన (1917-27), హృదయేశ్వరి (1924- 26), వకుళమాలిక (1935), సాధకుడు (1936), రత్నాకరము (1938-39),
సాహిత్య విమర్శ
517