Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/516

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లైనందుకు కొన్ని నిదర్శనాలున్నాయి. అటువంటి సందర్భంలో ఒక యువసాహిత్యకుడు “మీరు జగద్గురువు”లని అంటే చమత్కారం కోసం 'జగద్గురువునే' అని అంగీకరించి, ఈ పదానికి "జగత్తునే గురువుగా కలవాడు అన్నది నా ప్రస్తుతార్థము” అని చెప్పి, పెద్దలు తమను అపార్థం చేసుకోవటానికి శ్రీ శివశంకరులు అవకాశమివ్వ లేదు. ఒకమారు ఒక సాహిత్యకుడు స్వామివారు వస్తే పండితులని పిల్చి గోష్ఠి చేయిస్తున్నప్పుడు, ఒక పండితుడు "ఆచార్య శంకరుల జయంతి ఇవాళే ఎందుకు? ఎప్పుడు చేస్తే ఏమి?" అని ప్రశ్నించాడు. శివ శంకరస్వామి "పెద్దలు ఏ నాడో 'కాదినవ పరిగణనతో' 512 = 215 = వైశాఖ శుద్ధ పంచమి అని తేల్చి ఈ నాడే ఆచార్య శంకరజయంతి చేయించటం వల్ల మనం భిన్నంగా వర్తించరా” దాని ప్రామాణిక వచన మిచ్చి పాదాభివందనాన్ని పొందారు.

శివశంకరస్వామి ప్రకృతి సౌందర్యం కలవి, చారిత్రక, వైజ్ఞానిక, సాంస్కృతిక ప్రాధాన్యం కలవి అయిన ఉత్తర దక్షిణ భారత దేశాలలోని బహుప్రదేశాలను జిజ్ఞాసాత్మకంగా దర్శించి, ఆనందాన్ని, సాహిత్యరచనోపయోగాలను పొందారు. వీరికి నిత్యం ఏదో ఒక పుస్తకపఠనం చేస్తూండటం యౌవనారంభకాలంలోనే అలవాటయినది. తామభ్యసించిన వ్యాకరణాది శాస్త్రాలకు, అలంకార ధర్మశాస్త్రాదులకు, వేద విజ్ఞానానికి సంబంధించిన గ్రంథాలను పఠించటమే కాక, వీరు ప్రాచ్య పాశ్చాత్య భాషలలోని అనేక సాహిత్య ప్రక్రియలకు సంబంధించిన గ్రంథాలను, తత్త్వశాస్త్ర, మానసిక శాస్త్ర, లైంగిక శాస్త్ర గ్రంథాలను, ప్రముఖ ప్రాచ్య పాశ్చాత్య దేశ చరిత్రలను, ప్రపంచ శిల్ప చిత్రకళాచరిత్రలను, మహాపురుష జీవితచరిత్రలను, ఇంకా అనేక విషయాలకు సంబంధించిన గ్రంథాలను వృద్ధాప్యంలో తుదినాటివరకు పఠించారు. ఇందువల్ల సర్వతోముఖ జ్ఞానులైనారు. అపార గ్రంథపఠన అనేక విషయాలమీద మహోపన్యాసాలు ఇవ్వటానికే కాక, సాహిత్యసృష్టికి వీరికి ఎంతగానో ఉపకరించింది. ఇంతటి గ్రంథపఠన చేసినవారు కావటం వల్లనే శివశంకరుల లేఖలు, పీఠికలు, గ్రంథ పరిచయాలు, విమర్శలు, ఇత్యాదులు మహాశక్తిమంతాలు, ప్రయోజనాత్మకాలుగా రూపొందాయి.

ప్రాచీన లక్షణాలు కలవి కావటం చేత 1916 వరకు తాము వ్రాసిన పద్య రచనలను, నాటకాలను పరిత్యజించి, శివశంకరస్వామి నవ్యత్వశోభితమై 1917 నుంచి 1977 వరకు సాగి షష్టిపూర్తి జరిపించుకొన్న నవ్య కవిత్వరచననే ప్రకటించి నిల్పుకొన్నారు. స్వానుభవం వల్ల అవతరించిన వీరి కవిత్వసాహిత్యం బహుముఖ


516

వావిలాల సోమయాజులు సాహిత్యం-4