Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/515

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

1970 తరువాత శివశంకరులు వెనుకటికంటే అధికంగా వేదాంత గ్రంథాలకు, భాష్యాలకు, భగవద్గీతకు, ఉపనిషత్తులకు, పురాణాలకు సంబంధించిన ఉపన్యాసాలు చేస్తుండేవారు. ఇట్టి స్థితిలో 1973న వీరి ద్వ్యశీతి జన్మవాసరదినాన 'రాజజామాత' అనే గేయనాటికను పిశుపాటి వెంకటరాయ శర్మకు అంకితమిచ్చి ప్రకటించటం జరిగింది. ఇది "A woman is incapable of jealousy man only is capable” అన్న జర్మన్ తత్త్వవేత్త 'నీచే' అభిప్రాయాన్ని రూపిస్తున్నట్లు గోచరించే గేయనాటిక. వీరి అనేక నాటికలకు వలె దీనికి గూడ కల్హణుని 'రాజతరంగిణి'లోని కథాలేశం మూలము. ఈ కాలంలోనే శ్రీ శివశంకర స్వామి రాజతరంగిణిలోని మరొక కథావస్తువుతోనే "నోణకభార్య" అనే గేయనాటికను సైతం రచించారు. సంస్కృతంలో శ్రీ గిడుగు రామమూర్తి పంతులు అభిలషించిన “స్థితప్రజ్ఞులు” అనే నవల వంటి ఒక వచనగ్రంథాన్ని, ఒక పద్యకావ్యాన్ని, ఆంధ్రంలో ఒక మహాకావ్యాన్ని - జీవిత లక్ష్యాన్ని ప్రతిపాదించేదాన్ని వ్రాయాలన్న వీరి కోరికను నిర్వర్తించుకోవటానికి, 1973-74లలో యోచనలు చేస్తూ ఉండేవారు. 1975లో ప్రపంచ ప్రథమాంధ్ర మహాసభవారు వీరిని గౌరవించారు. ఆ సంవత్సరమే సర్వతోముఖ సాహిత్యప్రజ్ఞానిధులు, సక్రమమైన సంప్రదాయంలో నవీనదృష్టితో, నూతన కల్పనలతో సాహిత్యాన్ని పెంపొందించటమే లక్ష్యంగా జీవించినవారు అయిన వీరిని ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు 'కళాప్రపూర్ణ, డాక్టరేటు” బిరుదమిచ్చి సన్మానించి తమ గౌరవాన్ని నిల్పుకొన్నారు.

వృద్ధాప్యంలోని తుది దినాలలో కూడా సాహిత్యలోక కుటుంబి అయిన శ్రీ శివశంకరులు దేశం నలుమూలలా పర్యటిస్తూ, సాహిత్యకుల సంక్షేమాన్ని, కృషిని పరిశీలించారు.

తే. "సహజ దరహాస మృదువచస్సరణి మీరు
అమల సౌహార్దమున సేమ మరయునపుడు
మత్తిలిన నా ఎడందలో మాటుమణుగు
శ్రవణసుఖదాయి యుష్మత్ప్రసంగసరణి. ”

అన్నది శ్రీ స్వామివారు వచ్చి ప్రథమతః ప్రసంగించినప్పుడు సాహిత్యకులు పొందే అనుభూతికి ఇది ఒక తార్కాణం. వీరు చిత్రాతిచిత్ర సంభాషణలతోనూ, చేష్టలతోనూ సాహిత్యకుల ఇళ్ళలోని స్త్రీ పురుషులను, బాలురను ఆకర్షించి, ఆప్తులై పరమానందాన్ని పంచి ఇస్తుండేవారు. సాహిత్యకుల బంధువులు మరణించిపుడు శవవాహక లోపము వల్ల వ్యథపడుతుంటే శివశంకరస్వామి తామే ఆ పనిని నిర్వహించి పూజనీయు


సాహిత్య విమర్శ

515