నవ్యసాహిత్య పరిషత్తులో శ్రేయస్సును కాక కేవలం ప్రేయస్సును మాత్రమే అభ్యసించే సభ్యుల సంఖ్య, మార్క్స్ తత్త్వవేత్త ఆర్థిక దృక్పథమే ప్రధానమైన "ప్రగతి సాహిత్య" ప్రియులైన సభ్యుల సంఖ్య, మానసిక శాస్త్రవేత్తలైన ఫ్రాయిడ్, యాడ్లర్ యాంగ్ మొదలైన వారి సిద్ధాంతాలను అనుసరించి కామప్రధానంగా రచనలు చేసే సభ్యుల సంఖ్య విస్తరించి, యువకులు దృష్టి శాంతిప్రధానము, కళాత్మకము, నిత్యత్వతాగుణ విశిష్టము అయిన సాహిత్యాన్ని దర్శించే అవకాశం క్రమక్రమంగా సన్నగిల్లిపోతూ, 1945 నాటికి శక్తిహీనమైనది అవుతుండటం వల్ల శివశంకరులు నవ్యసాహిత్య పరిషత్తునుంచి తప్పుకొని, సాహితీసమితిని పటిష్ఠం చేసి తద్వారా ఉత్తమ కవిత్వసేవ చేయదల్చుకున్నారు. ఆ సమయంలో సాహిత్యానికి సంభవిస్తున్న ప్రమాదాన్ని సహించలేక, చివరకు ఆంధ్ర మహాసభవారిచేత 25-2-1946న, తెనాలిలో సాహితీ సమితి రజతోత్సవం జరిపించారు.
ఈ ఉత్సవ ప్రారంభంలో ఆధునిక సాహిత్య విధానాలను మథించిన సాహిత్యార్థవ కర్ణధారివలె నూతన సభ్యులు, సభాధ్యక్షులు అయిన శ్రీ కురుగంటి సీతారామభట్టా చార్యులు "ప్రస్తుత వాతావరణాన్ని బట్టి దేశీయుల హృదయాలల్లో మార్పులు కలిగి తద్వారా సాహిత్య సిద్ధాంతంలో కూడా మార్పు కలిగినది. సాహిత్యము ప్రజకొరకే అని చెప్పవలసినా, కవిని అనుసరించి ప్రజలు, ప్రజలననుసరించి కవి ఉండటం అవసరమే అయినా, ఉత్తమ కవి మాత్రం ప్రజలనే ఆకర్షించి వారిని తన దగ్గరకు లాక్కుంటాడు... ఇప్పుడు సాహిత్య పరమావధి రసాస్వాదనమా, విషయ ప్రచారమా అన్న ప్రశ్నలు ఉద్భవిస్తున్నవి. సాహిత్యం ఆనందపర్యవసాయి. ఆనందానికి రసానుభూతి ప్రధానము. రససిద్ధాంతాన్ని అంగీకరిస్తేనే తప్ప సాహిత్యతత్త్వం సిద్ధించదు. సాహితీ సమితి సభ్యులు, తత్సంపర్కము కలవారు రససిద్ధాంతాన్ని పూర్తిగా ఆమోదించటమే కాక తమ రచనలతో దృష్టాంతరీకరిస్తున్నారు" అని వెల్లడించారు. సాహితీ సమితి సాహితిని గురించి మాట్లాడుతూ శ్రీ జమ్మలమడక “శివశ్రీ లోకాన్ని గుర్తిస్తూ లోకభావానుకీర్తనం చేస్తూ, సహృదయలోకానికి సాహిత్యారాధన సామర్థ్యాన్ని ఆస్వాదనశక్తిని సంపాదించాడు. స్త్రీశక్తిని స్త్రీశక్తిగా భావించి శివశ్రీ మధుర శృంగారానుభూతిని అభినవమంజులంగా అందించటం వల్ల లోకం ఆకృష్టమయినది. శృంగారమును మధుర భావదృష్టితో చూడటమును శివశ్రీ లోకానికి నేర్పినాడు... శివశక్తుల సామరస్యము సాహిత్యము. దీనికి సంబంధించిన కాంతామయమైన ఉపాసనను లోకానికి అందించిన శివశంకరశాస్త్రి విశిష్టమూర్తి" ఇత్యాదిగా ఉపన్యసించారు. సుప్రసిద్ధ సాహితీ సమితి సభ్యులయిన చింతా దీక్షితులు, ప్రభృతులు
512
వావిలాల సోమయాజులు సాహిత్యం-4