గిడుగువారి అధ్యక్షతన గుంటూరులో 1937న నవ్యసాహిత్య పరిషత్తు వార్షికోత్సవం జరిగినప్పుడు. బి.వి. నరసింహారావు మొదలైన ఉత్తమ నటశేఖరులు శ్రీ కృష్ణశాస్త్రి దర్శకత్వాన శ్రీ శివశంకరస్వామి రచించిన "పద్మావతీ చరణ చారణ చక్రవర్తి" అనే పద్యనాటికను మనోహరంగా ప్రదర్శించారు. గీతికలకు “రసిక ప్రియ” అనే నామాంతరము గల గీత గోవిందాన్ని, లాస్య ప్రధానమైన 'పీయూషలహరి' అనే ఏకాంక గేయనాటికను రచించిన జయదేవమహాకవి మధురభక్తిరూపమైన ప్రణయజీవితాన్ని ప్రదర్శించిన శివశంకరస్వామి వారి ఈ రూపకాన్ని దర్శించిన సాహిత్య ప్రియులు. విద్వత్కవివర్యులు ఎంతగానో మెచ్చుకున్నారు. 1940లో నవ్యసాహిత్య పరిషత్తు వార్షికోత్సవం బెజవాడలో జరుగుతున్నప్పుడు శ్రీ శివశంకర స్వామి నవ్యాంధ్ర సాహిత్య నిర్మాతలలో ప్రథముడైన శ్రీ రాయప్రోలుకు అఖండ సన్మానం జరిగింది. ఆ సందర్భంలో ఉపన్యసిస్తూ 1913లో "రాయప్రోలు" రచించిన “తృణకంకణము” అనే కావ్యరచనతో నవ్యసాహిత్య యుగం ప్రారంభమైనదన్న విశిష్ట ప్రకటన చేశారు.
1938 ఫిబ్రవరిలో హైదరాబాదులోని శ్రీకృష్ణరాయ నిలయంలో అఖిలాంధ్ర కథకసమ్మేళన మహాసభలు మహోజ్జ్వలంగా రెణ్ణాళ్ళు జరిగినప్పుడే అధ్యక్షత వహించిన శివశంకరస్వామి తమపై అభిప్రాయాన్ని మొదలు వెల్లడించారు. కథక సమ్మేళనంలో శివశంకరస్వామి కథాసాహిత్యాన్ని గురించి సమగ్రమైన ప్రసంగం చేసి, ఆ నాటి నిజామ్ ఆంధ్రులకు ప్రోత్సాహాన్ని కలిగించటం వల్ల వారు హైదరాబాదులో నవ్యసాహిత్య పరిషత్తు శాఖను స్థాపించటానికి పూనుకొన్నాడు.
నవ్యసాహిత్య పరిషత్తుకు గుంటూరు ముఖ్య స్థానమైనప్పుడు నవ్య సాహిత్యానికి స్థాయిత్వము కలిగించటం కోసం శివశంకర స్వామి 1939-40 లలో గుంటూరు దివ్యజ్ఞానమందిరంలో ఏకాంతంగా ప్రశాంతంగా నివసిస్తూ, సాహిత్యకులను, యువవిద్యార్థి లోకాన్ని విశేషంగా ప్రోత్సహించారు. కవివర్యుల గ్రంథముద్రణ నవ్యసాహిత్య పరిషత్తునామంతో జరిగించటానికి విశేష కృషి చేశారు. ప్రతివారం దివ్యజ్ఞాన సమాజ మందిరంలో అనేక సాహిత్య ప్రక్రియల మీద, ప్రసిద్ధులైన ఆధునిక ఆంధ్ర రచయితల మీద, ప్రపంచంలోని ప్రముఖ సాహిత్యకుల మీద ఉపన్యాసాలు ఏర్పాటు చేసి నడిపించారు. ప్రతిభలో నవ్యత ప్రధానంగా రచనలు చేసిన వారి కృతులను ప్రత్యేకంగా ఆదరించి ప్రచురించారు. శిష్ట్లా ఉమామహేశ్వరరావు వంటి విప్లవ రచయిత రచన అయిన “విష్ణు ధనువు” వంటి ఆధునికకవి కృతులను తామే మార్దవ సంయమనాలు వహించి విమర్శించారు. తాము స్వయంగా కొన్ని పద్య
510
వావిలాల సోమయాజులు సాహిత్యం-4