అంగీకరింపలేకపోయారు. శ్రీ రాజా రంగయ్యప్పారావు అధ్యక్షతన 1930లో ప్రారంభమై సాగుతున్న ఆంధ్ర నాటకకళాపరిషత్తు, 1933లో యువనటులకు మంచి పాఠశాలను నడిపించదలచి శివశంకరస్వామిని గౌరవనీయులైన అధ్యాపకులుగా వర్తింపుడని ఆహ్వానిస్తే, పై కారణాలవల్లనే ఇందుకుకూడ అంగీకరింపలేకపోయినారు. శివశంకరస్వామి జిల్లా కాంగ్రెసు కార్యదర్శిత్వం వల్ల, ఆంధ్రరాష్ట్ర సభ్యత్వం వల్ల, పొందిన కారాగారశిక్షలవల్ల 1930 నుంచి రెండుమూడు సంవత్సరముల కాలంలో తగిన కులగురు పర్యవేక్షణ లేకపోవడం వల్ల నవ్యాంధ్రసాహిత్యలోకానికి అభివృద్ధి నిరోధకాలు, అనేక కష్టపరంపరలు ఎదుర్కొంటూ ఉండడం చేత, దేశంలోని అనేకమంది సాహిత్యకులు, ముఖ్యంగా విప్లవతత్త్వం గల యువసాహిత్యకులు క్లేశపడ్డట్టు వ్యక్తమౌతున్నది. శివశంకరస్వామి తమ “నీలకంఠ కథ" అనే శృంగార కథల మూలంగా విశేష ప్రచార సహాయం చేస్తుంటే, అభ్యుదయ దృక్పథంతో "అహంభావ” సాహిత్యాన్ని సృష్టించే దృష్టితో జ్వాలాపత్రికను నడుపుతున్న ముద్దుకృష్ణ మహాశయుడు ఈ క్లిష్ట పరిస్థితుల వల్ల ఎంతో చింతపడ్డట్టు విశేషంగా వ్యక్తం చేశారు. 1933-34లలో శివశంకరస్వామి తన రాజకీయాది జీవితానికి కొంత స్వస్తి చెప్పారు. జన్మస్థానమైన కాజకు సమీపంలో ఉన్న కంతేరనే గ్రామానికి కొంతదూరంలో ప్రకృతి మనోజ్ఞమైన మహేశ్వరాశ్రమాన్ని నిర్మించుకొని ప్రశాంతంగా, ఏకాంతంగా, మునివృత్తితో జీవించారు. ఆ సమయంలో వీరు నూతనమైన రసవత్కావ్యసృష్టి చేయటం, సమీప ప్రదేశాలనుంచి తమను దర్శించటానికి వచ్చే జనసామాన్యానికి భక్తిని, రాజకీయ విజ్ఞానాన్ని ప్రసాదించటం, సాహితీ సమితి సభ్యులను ఉత్తమంగా ప్రోత్సహించి నూతన సాహిత్య సృష్టి చేయించటం సాగించారు. ఈ కాలానికి సాహితీసమితి ప్రాశస్త్యం అమెరికాకు, కొన్ని పాశ్చాత్య దేశాలకు వ్యాపించింది. ఒక అమెరికా విజ్ఞాన సర్వస్వం "శివశంకరుల ప్రభావం వల్ల 1917లో ఆయన సభాపతిత్వంతో, ఉత్తమ సాహిత్యక కవి మిత్రబృందం ఏర్పరుచుకొన్న 'సాహితీ సమితి' 'ప్రీ రాఫెలైట్ బ్రదర్ హుడ్' వలె నడచి నూతన సాహిత్యకృషి చేసి, ఈ నాడు మంచిపేరు తెచ్చుకుంటున్నది” అని వెల్లడి చేసింది. సాహితీ సమితి సభ్యులే కాని, ఇతర విద్వాంసులు, కవులు, కథకులు సైతం సాహితీసమితి కృషిని మెచ్చుకొనే సందర్భంలో శివశంకరస్వామిని, కీర్తించటం జరిగింది. ఇందుకు 'కవిమిత్రులు' అన్న కృష్ణాపత్రిక వ్యాసాలలో, మహాకథకులు విద్వద్వరేణ్యులు అయిన మల్లాది రామకృష్ణశాస్త్రి శివశంకరస్వామిని గురించి చేసిన ప్రశంస ఒక నిదర్శనం. ఇందులో శ్రీ రామకృష్ణశాస్త్రి "శాస్త్రిగారు కవి కళవళికలతో కనపడతారు; పలకరిస్తే పండితుడిలా మాట్లాడుతారు. ఆ మనోహర రూప భావ సాహిత్య విమర్శ 507
పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/507
స్వరూపం